కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఆమె మోజు మాత్రం పక్కింటి యువకుడిపై పడింది.. చివరకు

ప్రతీకాత్మక చిత్రం

Extramarital Affair: వారిద్దరికి పెళ్లి కాలేదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ వీరి కాపురంలో ఓ వ్యక్తి వచ్చి నిప్పులు పోశాడు. అతడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరి మధ్య అడ్డు వస్తున్నాడని ఆమె తాజా ప్రియుడితో కలిసి అతడిని చంపేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  వివాహేతర సంబంధాలు, సహజీవనం ఈ రోజుల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వీటివల్ల ఎన్నో కుంటుబాలు రోడ్డన పడ్డాయి. ఎంతో మంది ప్రాణాలను కూడా వదిలారు. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడితే, సహజీవనం వంటి సంబంధాలు వారి జీవితాలను నట్టేట ముంచుతున్నాయి.
  దేశంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ భార్య యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ కలిసి సహజీవనం చేస్తున్న భర్త లాంటి వ్యక్తిని కడతేర్చింది. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నోయిడాలో ముఖేష్ (22) ఓ యువతిని ప్రేమించి కొన్ని సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నాడు. తన స్వగ్రామాన్ని వదిలి పట్టణానికి వచ్చి ఆమెను పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేశాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి జరగకపోయినా ఎంతో అన్యోన్యంగా ఉంటూ జీవితం గడుపుతున్నారు. వీళ్ల మధ్యలోకి అంకుష్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. వారి కాపురంలో చిచ్చు పెట్టాడు.

  తన ఇంటి పక్కనే ఉన్న అతడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలా ఆమె ముఖేష్ కు తెలియకుండా వివాహేతర సంబంధాన్ని నడిపించింది. కానీ ఓ రోజు ముఖష్ కు తెలిసి.. ఆమెను మందలించాడు. పెళ్లి చేసుకోకపోయినా నీకు ఏం తక్కువ చేశాను అంటూ వాపోయాడు. ఇంట్లో పిల్లలు ఉన్న సంగతి మరిచి ఇలాంటి పాడు పనికి పాల్పడతావా.. అంటూ ఆమెను తీవ్రంగానే మందలించాడు. మనస్థాపానికి గురైన సదరు మహిళ జరిగిన విషయాన్ని అంకుష్ తో చెప్పంది. అంతే కాదు అతడి ఒళ్లో కూర్చోని మరీ కన్నీటి పర్యంతం అయింది.

  Also Read:  అతడికి కబడ్డీ అంటే ప్రాణం.. తన చివరి మజిలీ కూడా కబడ్డీ కోర్టే అయింది.. విషయం ఏంటంటే..

  దీంతో తీవ్ర కోపోద్రిక్తుడు అయిన అంకుష్ అతడిని కొట్టడానికి బయలు దేరాడు. కానీ ఆమె టైం చూసి చెప్తాను అంటూ అతడిని ఆపేసింది. వీరిద్దరి మధ్య ముఖేష్ అడ్డువస్తున్నాడని.. ఎలాగైన అతడిని అడ్డు తొలగించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ముఖేష్‌పై లేని ప్రేమను నటించి అతడికి ఆమె మద్యం తాగించింది. ఫుల్ గా తాగి మత్తులో అతడు చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. ఈ విషయాన్ని అంకుష్ కి ఫోన్ చెప్పి.. వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. అంకుష్ ఆమె ఇంటికి రాగానే ఇద్దరూ కలిసి మద్యం మత్తులో ఉన్న ముఖేష్‌ను హతమార్చారు. మరుసటి రోజు ఇక ఆమె అరుపులతో డ్రామా మొదలు పెట్టింది. ఆ కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకొని ఏమైంది అమ్మా.. అంటూ ఆమెను ఆరా తీశారు. దీనితో ఆ యువతి మొసలి కన్నీ​రు కార్చుతూ రాత్రి మద్యం తాగి మత్తులో నిద్రపోయిన ముఖేష్‌ ఉదయాన్నే ఇలా చనిపోయి కనిపించాడని నాటకమాడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

  వారికి కూడా ఇలానే సమాధానం చెప్పింది. కానీ వారు పోలీసులు కదా.. ఆమె కట్టుకథని నమ్మలేదు. ఆమె ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. అక్కడ నుంచి ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించారు. దెబ్బకు జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. ముఖేష్‌ను తన ప్రియుడు అంకుష్‌తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. పోలీసులు అంకుష్ కోసం వెతికి పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేశారు.
  Published by:Veera Babu
  First published: