పెళ్లిపీటల మీద వధువుకు వాంతులు... అనుమానంతో శీలపరీక్ష జరిపించిన వరుడు...

పెళ్లి మండపంలో వాంతులు చేసుకున్న వధువు... అనుమానంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లిన వరుడు... అనుమానపు మొగుడితో కాపురానికి నిరాకరించిన వధువు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 30, 2019, 3:15 AM IST
పెళ్లిపీటల మీద వధువుకు వాంతులు... అనుమానంతో శీలపరీక్ష జరిపించిన వరుడు...
పెళ్లిరోజే వధువుకు వాంతులు... అనుమానంతో శీలపరీక్ష జరిపించిన వరుడు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 30, 2019, 3:15 AM IST
మండపంలో ఘనంగా పెళ్లి జరుగుతోంది. వధువూ, వరుడూ ఇద్దరూ ఉన్నత విద్య అభ్యసించినవారే. బెంగళూరులో ఓ కార్పొరేట్ కంపెనీలో మంచి జీతానికి ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఆఫీస్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, పెళ్లిదాకా వచ్చింది. పెళ్లి జరుగుతుండగా ఆమెకు వాంతులు అయ్యాయి. అంతే అతనిలో అనుమానం పుట్టింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా భార్యగా మారిన ప్రియురాలికి కన్యత్వ పరీక్షలు చేపించాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. బెంగళూరు నగరానికి చెందిన 29 ఏళ్ల శరత్, తనతో పాటు పనిచేసే 26 ఏళ్ల యువతి ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ఇంట్లో ఒప్పించి, పెళ్లికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. గత ఏడాది నవంబర్‌లోనే వీరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లికి 15 రోజులు ఉండగా, ఆమె తల్లి చనిపోయింది. దాంతో పెళ్లి వాయిదా పడింది.

తాజాగా పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్నారు ఇరు వర్గాలు. అయితే పెళ్లిరోజునే ఆమె వాంతులు చేసుకుంది. కంగారుపడిన శరత్, ఆమె వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆమె మీద ప్రేమతో ఏమైందోననే కంగారుపడి తన ప్రియురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లలేదు అతను. ఆసుపత్రికి తీసుకెళ్లి, శీలపరీక్ష చేయించాడు. పెళ్లిరోజునే వాంతులు చేసుకోవడంతో అనుమానం వచ్చి, వధువుకి కన్యత్వ పరీక్షలతో పాటు గర్భధారణ పరీక్షలు కూడా చేయించాడు. అయితే గ్యాస్టో సమస్య కారణంగా వాంతులు జరగాయని తేలింది. విషయం తెలుసుకున్న వధువు... అనుమానపు మొగుడితో కాపురానికి నిరాకరించింది. పెళ్లి రోజే ఇంత అనుమానం పెంచుకున్న అతన్ని పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పేసింది. పెళ్లిరోజే ఇద్దరూ విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


First published: March 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...