Home /News /crime /

SHE LOOKS SO HAPPY WITH HER HUSBAND BUT REALITY HUSBAND RUIN HER LIFE SSR

Wife: భర్తతో కలిసి ఇంత హ్యాపీగా కనిపిస్తున్న ఈమెకే ఎందుకిలా జరిగిందో పాపం..

సుకంఠ, మహేశ్వరన్

సుకంఠ, మహేశ్వరన్

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో విషాద ఘటన జరిగింది. భర్త వేధింపులు తాళలేక గవర్నమెంట్ డాక్టర్‌గా పనిచేస్తున్న ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

    రామనాథపురం: తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో విషాద ఘటన జరిగింది. భర్త వేధింపులు తాళలేక గవర్నమెంట్ డాక్టర్‌గా పనిచేస్తున్న ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మరో బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆమె గర్భిణి కూడా కావడం శోచనీయం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామనాథపురం జిల్లా దేవిపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుకంఠ(31) అనే మహిళ గవర్నమెంట్ డాక్టర్‌గా పనిచేస్తోంది. ఆమెకు 2019లో రామనాథపురం ప్రాంతానికి సమీప గ్రామమైన సదయన్ వలసై గ్రామానికి చెందిన మహేశ్వరన్ అనే డాక్టర్‌తో వివాహం జరిగింది. భర్త ఒత్తిడి చేయడంతో సుకంఠ ఇప్పటికే రెండు సార్లు అబార్షన్ చేయించుకుంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భవతి. ఈ క్రమంలోనే పని మీద ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లాడు.

    భార్యను కూడా నెల రోజులు సెలవు పెట్టాలని, ఢిల్లీకి వెళ్లాలని చెప్పాడు. అక్కడ నుంచి గత అక్టోబర్‌లో భార్యాభర్త తిరిగి రామనాథపురం వచ్చి అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. రామనాథపురం వచ్చాక భర్త ప్రవర్తనలో సుకంఠకు ఊహించని మార్పు కనిపించింది. డాక్టర్‌గా ఓ హాస్పిటల్‌లో పనిచేస్తున్న తన భర్త విధులకు వెళ్లడం మానేశాడు. ఇంట్లోనే ఉంటూ భార్యను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఆమెను తిడుతూ.. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ బాధించాడు. అంతేకాకుండా.. గర్భిణి అని కూడా చూడకుండా కొడుతూ వేధింపులకు గురిచేశాడు. ఈ విషయాన్ని సుకంఠ తన తల్లికి ఫోన్ చేసి చెప్పుకుని బాధపడింది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి లోనైన ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. చికిత్స పొందుతూ సుకంఠ ప్రాణాలు కోల్పోయింది. కూతురు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసి సుకంఠ తల్లి కన్నీరుమున్నీరయింది. అల్లుడి వల్లే తమ కూతురి ప్రాణం పోయిందని, అతనిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది.

    ఇది కూడా చదవండి: Couple: ఇంత అందమైన భార్య ఉండి ఏం లాభం.. పాపం ఈ భర్త.. ఏం జరిగిందంటే..

    రామనాథపురం బజార్ పోలీస్ స్టేషన్ పోలీసులు సుకంఠ తల్లి ఫిర్యాదుతో డాక్టర్ మహేశ్వరన్‌పై కేసు నమోదు చేశారు. తమ కూతురికి ఈ పరిస్థితి తీసుకొచ్చిన అల్లుడే ఆమె వైద్య ఖర్చులకు అయిన డబ్బు కట్టాలని సుకంఠ కుటుంబం, ఆమె గ్రామస్తులు డిమాండ్ చేశారు. మహేశ్వరన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు. డీఐజీ మయిల్‌వకణ్ణన్, ఎస్పీ కార్తీక్ సుకంఠ తల్లిదండ్రులతో మాట్లాడి.. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో సుకంఠ కుటుంబం ఆమె మృతదేహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రాణాలు కాపాడే వైద్య వృత్తిలో ఉండి మహేశ్వరన్ భార్య చావుకు కారణమయ్యాడు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Husband, Tamilnadu, Wife suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు