హోమ్ /వార్తలు /క్రైమ్ /

'బాయ్‌ఫ్రెండ్' మాంసంతో బిర్యానీ.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన

'బాయ్‌ఫ్రెండ్' మాంసంతో బిర్యానీ.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన

చాలారోజుల వరకు ఈ విషయం వెలుగులోకి రాలేదు. కానీ ఇటీవల ఆమె బాయ్‌ఫ్రెండ్ సోదరుడు అతని గురించి ఆరా తీసేందుకు వెళ్లగా.. అసలు నిజాలు బయటపడ్డాయి.

  సౌదీ అరేబియాలో ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌ను అత్యంత దారుణంగా హతమార్చింది. హతమార్చడమే కాదు.. అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి.. ఆ మాంసంతో బిర్యానీ వండింది. ఆపై అదే బిర్యానీని అక్కడి పనివాళ్లకు వడ్డించింది. అది మనిషి మాంసం అని తెలియని ఆ పనివాళ్లు.. ఆ బిర్యానీని ఆరగించారు. వినడానికే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటన చాలామందిని ఉలిక్కిపడేలా చేసింది.

  వివరాల్లోకి వెళ్తే.. అబుదాబీకి చెందిన ఓ మహిళ(30), ఓ యువకుడితో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది. అయితే ఇటీవల ఆ యువకుడు మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం... తనను పట్టించుకోకపోవడంతో ఆమె అతనిపై కక్ష పెంచుకుంది. దీంతో ఓరోజు తన ఇంటికి వచ్చిన అతన్ని ముక్కలు ముక్కలుగా నరికేసింది. అనంతరం ఆ మాంసంతో మొరాకో బిర్యానీ వండింది.

  ఆ సమయంలో తన ఇంటి వద్ద పనులు చేస్తున్న భవన నిర్మాణ కార్మికులను పిలిచి.. వండిన బిర్యానీని వారికి వండించింది. అయితే ఈ విషయం చాలారోజుల వరకు వెలుగులోకి రాలేదు. ఇటీవల ఆమె బాయ్‌ఫ్రెండ్ సోదరుడు అతని గురించి ఆరా తీసేందుకు ఆ ఇంటికి వెళ్లాడు. అయితే అతనితో విడిపోయి చాలారోజులైందని, ప్రస్తుతం ఎక్కడున్నాడో తనకు తెలియదని ఆమె బుకాయించింది.

  అయితే అదే ఇంట్లో ఓ చోట మనిషి దంతాలు కనిపించడంతో అతనిలో అనుమానం మొదలైంది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆపై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. ఇంట్లో దొరికిన దంతాలను డీఎన్ఏ పరీక్షకు పంపించగా.. అవి అతనివే అని తేలింది. బాయ్‌ఫ్రెండ్‌ను ఇంత దారుణంగా హతమార్చిన ఆ మహిళ విషయం ప్రస్తుతం సౌదీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

  First published:

  Tags: Crime, Saudi Arabia

  ఉత్తమ కథలు