హోమ్ /వార్తలు /క్రైమ్ /

Sad Incident: ఆమె ఎన్నో ఆశలతో ఇంటర్ కాలేజీలో జాయిన్ అయింది.. అతడు చేసిన ఆ పనికి.. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది..

Sad Incident: ఆమె ఎన్నో ఆశలతో ఇంటర్ కాలేజీలో జాయిన్ అయింది.. అతడు చేసిన ఆ పనికి.. పరిస్థితి ఇక్కడ వరకు వచ్చింది..

దర్గాభవాని (ఫైల్)

దర్గాభవాని (ఫైల్)

Sad Incident: మహిళలపై అత్యాచారాలు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఏం చేయాలో వాళ్లు చేసేస్తున్నారు. అయితే ఇక్కడో విద్యార్థిని ప్రేమ వేధింపులకు బలైపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...

  భారతదేశంలో ఎన్ని చట్టాలు(Laws) తీసుకొచ్చినా మహిళలపై హత్యలు(Murder), అత్యాచారాలు(Rape) ఆగడం లేదు. నిర్భయ(Nirbhaya), దిశ(Disha) లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు(Gang Rape) ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో(Social Media) పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అయితే ఇక్కడ జరిగిన ఘటనలో ప్రేమ పేరుతో ఓ విద్యార్థిని వేధించాడు. మనస్థాపానికి గురైన సదరు యువతి ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

  Painfull Incident: దారుణం.. అతడు ఆ పని చేశాడని.. పందిరి గుంజ కు 18 గంటల పాటు తాళ్లతో కట్టేసి చితకబాదారు..


  ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి చెందిన బట్టు రాజమల్లుకు ఓ కూతురు ఉంది. ఆమె పేరు దుర్గా భవాని(17). ఆమె స్థానిక మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆమెను అదే గ్రామానికి చెందిన గురజాల ఏలేందర్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వేధింపులకు గురి చేసేవాడు.

  Sad: వాళ్లిద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు కదా.. వాళ్లను చూసిన తర్వాత భార్యభర్తలు ఇలా ఉండొద్దని నేర్చుకుంటారు..


  ఆమె కాలేజీకి వెళ్లే సమయంలో.. వచ్చే సమయంలో ఏలేందర్ స్నేహితులతో కలిసి ఇబ్బందుల పెట్టేవాడు. ఓ రోజు దుర్గా భవానిని.. సదరు వ్యక్తి వేధిస్తున్నాడని.. రాజమల్లుకు తెలిసింది. దీంతో పెద్దమనుషులను పిలిపించి.. వారి సమక్షంలో పంచాయితీ పెట్టించాడు. మరో సారి ఇలా చేయనని.. పెద్ద మనుషుల ముందు ఒప్పుకున్నాడు. ఆ రోజు నుంచి అతడు హైదరాబాద్ వెళ్లి.. ఏదో ఒక పని చేసకుంటూ జీవనం సాగించాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ అతడు స్వగ్రామానికి వచ్చాడు. ఫ్రెండ్స్ సహాయంతో దుర్గాభవాని ఫోన్ నంబర్ సాధించి.. ఫోన్ చేస్తూ.. వేధింపులకు గురి చేశాడు. ఈ సారి సదరు మహిళ తీవ్ర మనస్థాపానికి గురైంది.

  అతడు సంతోషంగా వదిన ఇంటికి వెళ్లాడు.. చెప్పాల్సింది చెప్పేశాడు.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..


  ఆ వేధింపులు భరించలేక ఆమె ఇంట్లోనే ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు బాలికను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ కొన్నాళ్లు చికిత్స అనంతరం.. మళ్లీ సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె అదే రోజు సాయంత్రం మృతి చెందింది.

  ఏలేందర్, మరో ఏడుగురు స్నేహితులు కలిసి వేధించడంతోనే దుర్గాభవాని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు పరారీలో ఉన్నారని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news, Yadadri

  ఉత్తమ కథలు