అనాథనంటూ యువకులకు దగ్గర అవుతుంది.. పెళ్లి చేసుకొని మరో పెళ్లి కోసం ఎదురు చూస్తుంది.. ఎందుకంటే..

ప్రతీకాత్మక చిత్రం

Telangana Crime: పెళ్లి పేరుతో వ్యక్తులను మోసం చేసి లక్షల్లో దండుకున్న కిలేడి నిత్య పెళ్లికూతురు సుహాసినిని మణుగూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం తిరుపతిలో పట్టుపడిన ఆమెను పోలీసులు రిమాండ్‌కు పంపారు.

 • Share this:
  అనాథనంటూ యువకులను మోసం చేసి పెళ్లిళ్లు చేసుకున్న ఓ మాయలేడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల క్రితం తిరుపతిలో పట్టుపడిన ఆమెను పోలీసులు రిమాండ్‌కు పంపారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కోనరాజుపాలేనికి చెందిన ముప్పాల సుహాసిని.. మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని పీకే-1 సెంటర్‌కు చెందిన దేవరకొండ వినయ్‌ను తాను అనాథనంటూ పరిచయం చేసుకొంది. అతడికి మాయమాటలు చెప్పి పెళ్లికి ఒప్పించింది. 2019 మే 23న పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో అతడిని వివాహం చేసుకొంది. కొంతకా లం తర్వాత ఇంట్లో ఉన్న రూ.1.5 లక్షల నగదు, మూడున్నర లక్షల విలువైన బంగారు అభరణాలను దొంగిలించి పారిపోయింది. పెళ్లి తరువాత ఇంటిలో బంగారం, నగదుతో ఉడాయించిందని.. 15 లక్షల బంగారం నగలు, నగదు దొంగిలించినట్లు వినయ్ మణుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొద్దికాలం భార్య కోసం ఎదురుచూసిన వినయ్‌.. తాను మోసపోయానని తెలుసుకుని గత నెల 6వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తిరుపతి అలిపిరి సమీపంలోని తిరుపతి మహిళా ప్రాంగణంలో ఈనెల 15న పోలీసులు సుహాసినిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. విజయపురం మండలం నాగరాజకండ్రిగ కు చెందిన సునీల్‌కుమార్‌(29) మార్కెటింగ్‌ ఉద్యోగం చేసుకుంటూ తిరుపతిలోని సత్యనారాయణపురంలో నివస్తున్నాడు. ఇతనికి ఏడీబీ ఫైనాన్స్‌లో పనిచేసే ఎం.సుహాసినితో కలిగిన పరిచయం ప్రేమకు దారితీసింది. సునీల్‌ కుమార్‌కూ సుహాసిని మాయమాటలు చెప్పి తిరుపతిలో గత ఏడాది డిసెంబర్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తాను అనాథనని చెప్పడంతో సునీల్‌కుమార్‌ కుటుంబ పెద్దలు సుహాసినికి 20 గ్రాముల బంగారం అమ్మాయికి చేయించారు.

  ఆ తర్వాత అతడితో కాపురం చేసింది. కొన్ని రోజుల తర్వాత డబ్బులు కావాలని సునీల్‌ తండ్రి వద్ద మరో రూ.2లక్షలు తీసుకుంది. అంతేకాకుండా తనను చిన్ననాటి నుంచి ఆదరించిన వారికి అవసరమని సునీల్‌, ఆయన తల్లిదండ్రుల నుంచి రూ.ఆరు లక్షల నగదు తీసుకుని పరారైంది. విషయం తెలుసుకున్న ఆమె ఆధార్‌ కార్డు ఆధారంగా విచారించగా ఆమెకు అప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుతో వివాహమై ఒక కుమార్తె కూడా ఉన్నట్లు తెలిసింది. అలాగే ఏడాది క్రితం మరో వ్యక్తిని కూడా ఇలాగే మోసం చేసినట్లు గుర్తించాడు. ఈ విషయమై సునీల్‌.. అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందే ఆమెకు తన మేనమామతో వివాహమై, ఇద్దరు పిల్లలున్నట్లు ఈ కేసు విచారణలో వెలుగులోకి వచ్చింది. తిరుపతి స్విమ్స్‌ వద్ద వివేకానంద సర్కిల్‌లో సుహాసినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా సంచలన విషయాలు భయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆమెను రిమాండ్ కు తరలించారు.
  Published by:Veera Babu
  First published: