Home /News /crime /

SHANKARAPPA OF KARNATAKA WHO MARRIED 20 YEARS OLD MOHANA PREVIOUS YEAR COMMITTED SUICIDE AK

25 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య.. ఆమె ఇప్పుడు గర్భవతి.. అసలేం జరిగింది ?

శంకరప్ప, మోహన్ పెళ్లి ఫోటోలు (ఫైల్ ఫోటో)

శంకరప్ప, మోహన్ పెళ్లి ఫోటోలు (ఫైల్ ఫోటో)

ప్రశాంతత కరువైన పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామని తన భర్త శంకరప్ప తెలిపాడని.. అప్పుడు ఆయనను చచ్చిపోవాలని తన అత్తగారు తిట్టారని మోహన ఆరోపించింది.

    కర్ణాటక రాష్ట్రం తుమకూరులోని అక్కిమరి గ్రామానికి చెందిన 45 ఏళ్ల శంకరప్ప గత ఏడాది అక్టోబర్ 19న మోహనను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలా శంకరప్ప బాగా పాపులర్ అయ్యాడు. ఆ తరువాత కూడా శంకరప్ప తన భార్యతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యూయెట్‌లను పోస్ట్ చేసేవాడు. దీంతో తనకంటే వయసులో బాగా చిన్న అయిన మహిళను పెళ్లి చేసుకుని కూడా ఓ వ్యక్తి ఎంతో ఆనందంగా ఉన్నాడని.. ఇందుకు శంకరప్ప ఓ నిదర్శనమని నెటిజన్లు కూడా కామెంట్ చేశారు. ప్రేమకు, పెళ్లికి వయసు అడ్డుకాదనే విషయాన్ని శంకరప్ప, మోహన నిరూపించారనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే 20ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుని సంతోషంగా గడిపిన శంకరప్ప గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నాడు.

    భార్య, తల్లి మధ్య గొడవలే ఇందుకు కారణమని చెబుతున్నారు. నిన్న ఉదయం శంకరప్ప తన తోటలో శవమై కనిపించాడు. హుళియారు దుర్గ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం శంకరప్ప ఆత్మహత్య గురించి ఆయన భార్య మోహన చెప్పడంతో తాను, తన భర్త క్షేమంగా ఉన్నామని తెలిపింది. కానీ తమ అత్త ప్రతి 15 రోజులకు ఒకసారి తనతో గొడవ పడేవారని ఆరోపించింది. బయటికి వెళుతున్నానని తరచూ తనను దూషించేదని వాపోయింది. తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడనివ్వలేదని పేర్కొంది.

    ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామని తన భర్త శంకరప్ప తెలిపాడని.. అప్పుడు ఆయనను చచ్చిపోవాలని తన అత్తగారు తిట్టారని మోహన ఆరోపించింది. అలా కోపంతో ఇంటి నుంచి వెళ్లిన శంకరప్ప తిరిగిరాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తరువాత శంకరప్ప ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి రావడంతో మోహన కన్నీరుమున్నీరైంది. ప్రస్తుతం తాను నాలుగు నెలల గర్భవతిని అని వాపోయింది.

    OMG: వీడెక్కడి మొగుడండీ బాబూ.. పెళ్లాం కాపురానికి రాలేదని అత్తారింటిపై బాంబు దాడి

    కోడలితో మామ ఎఫైర్.. అడ్డుగా ఉందని భార్య హత్య.. ప్రమాదంగా చిత్రీకరణ.. కానీ చివరకు..

    అయితే శంకరప్ప ఇరుగుపొరుగు వాళ్లు కుక్కల పెంపకంపై అత్త, కోడలు మధ్య వాగ్వాదం జరిగిందని చెప్పారు. అందులో తల్లికి అనుకూలంగా మాట్లాడినందుకు మోహన శంకరప్పతో తీవ్ర వాగ్వాదానికి దిగిందని అన్నారు. దీంతో శంకరప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు