శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని కార్గో టెర్మినల్‌లో కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలిస్తున్న ఓ పార్సిల్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వజ్రాభరణాలుకి పైనుంచి వెండి పూత పూసి బంగారాన్ని గుర్తుపట్టకుండా అమర్చి గోల్డ్ మాఫియా తరలిస్తున్నట్టు గుర్తించారు. మొత్తం 21 కిలోల బరువు ఉన్న ఆ పార్సిల్‌లోని ఆభరణాల విలువను అధికారులు అంచనా వేశారు. ఓపెన్ చేసిన అధికారులు డైమండ్ వజ్రాభరణాలను పెద్ద పెద్ద తూనికలు కొలతలు వెయిట్ మిషన్ల సహాయంతో లెక్కించారు. మొత్తంగా ఆ పార్సిల్ ద్వారా తరలించాలని చూసిన ఆభరణాల విలువ దాదాపు 6.6 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అడ్డదారిలో బంగారం తరలిస్తున్న ఓ పార్సిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ఆ పార్సిల్‌లో 2.37 కిలోల బంగారం బిస్కెట్లు, 5.63 కిలోల బంగారు ఆభరణాలు, లూజ్ డైమండ్స్, స్టెయిన్లెస్ స్టీల్ గడియారాలు.. ఇతర విలువైన వస్తువులు గుర్తించారు. వాటి విలువ మొత్తం రూ. 6,62,46,387గా అంచనా వేశారు. ఆ పార్సిల్‌పై ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతుందో పూర్తి సమాచారం తెలియకపోవవడంతో.. సీసీ ఫుటేజ్, ఇతర మార్గాల ద్వారా విచారణ చేపడుతున్నారు.
ఈ పార్సిల్ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వీబీఎస్ పార్సిల్ నుంచి పంపించారని.. దానిపై భరత్‌లాల్ గుజ్జర్, సైనీ అనే ఇద్దరు వ్యక్తులకు డెలివరీ చేయాల్సిందగా పేర్కొన్నట్టు అదికారులు గుర్తించారు. ప్రొవిజన్స్ ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962, సీజీఎస్టీ యాక్ట్ 2017 ప్రకారం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Shamshabad Airport