షాద్‌నగర్ లైంగిక దాడి కేసులో... నిందితులకు 14 రోజుల రిమాండ్

నిందితులను బయటకు తీసుకురావడం సురక్షితం కాదని భావించిన పోలీసులు వైద్యుల్ని కూడా స్టేషన్ వద్దకు రప్పించి నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించారు.

news18-telugu
Updated: November 30, 2019, 4:08 PM IST
షాద్‌నగర్ లైంగిక దాడి కేసులో... నిందితులకు 14 రోజుల రిమాండ్
షాద్ నగర్ పోలీస్ స్టేషన్
  • Share this:
అత్మంత క్రూరంగా కామాంధుల దాహానికి బలైపోయిన యువతి హత్య కేసుపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ కేసులో నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు.నిందితుల్ని బయటకు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం లేకపోవడంతో... మెజిస్ట్రేట్‌నే షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద వేల సంఖ్యలో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. దీంతో నిందితులను బయటకు తీసుకురావడం సురక్షితం కాదని భావించిన పోలీసులు వైద్యుల్ని కూడా స్టేషన్ వద్దకు రప్పించి నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం మేజిస్ట్రేట్ ను పోలీస్ స్టేషన్ కే తీసుకొచ్చారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. నిందితులకు రిమాండ్ విధించిన నేపథ్యంలో, నిందితులను మహబూబ్ నగర్ జిల్లా జైలుకు పోలీసులు తరలించనున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: November 30, 2019, 4:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading