షాద్‌నగర్ హత్యకేసు.. చిన్న లింక్‌తో కేసు ముడి వీడిందిలా..

అపరిచితులకు తన స్కూటీ ఇవ్వడానికి సందేహించిన బాధితురాలు నిందితుడి సెల్ ఫోన్ నెంబర్ తీసుకుంది. బండి బాగు చేయించడానికి తీసుకుని వెళ్లిన వారు 15 నిమిషాల వరకు రాకపోవడంతో ఆమె వారికి ఫోన్ చేసింది.

news18-telugu
Updated: November 30, 2019, 7:29 PM IST
షాద్‌నగర్ హత్యకేసు.. చిన్న లింక్‌తో కేసు ముడి వీడిందిలా..
నమూనా చిత్రం (REUTERS)
  • Share this:
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ వద్ద ఓ పశువైద్యురాలిపై అత్యంత దారుణంగా లైంగికదాడి జరిగింది. అయితే, ఈకేసు చిక్కుముడి వీడడానికి ఒకే ఒక్క లింక్ దొరికింది. అదేంటంటే.. బాధితురాలు తన స్కూటీని తీసుకుని వెళ్లడానికి తాను పార్కింగ్ చేసిన స్థలానికి వెళ్లింది. అయితే, అక్కడ స్కూటీ టైర్ పంక్చర్ అయిందని నలుగురు నిందితులు చెప్పారు. ఆమె స్కూటీని బాగు చేయించుకుని తీసుకొస్తామని వెళ్లారు. అయితే, అపరిచితులకు తన స్కూటీ ఇవ్వడానికి సందేహించిన బాధితురాలు నిందితుడి సెల్ ఫోన్ నెంబర్ తీసుకుంది. బండి బాగు చేయించడానికి తీసుకుని వెళ్లిన వారు 15 నిమిషాల వరకు రాకపోవడంతో ఆమె వారికి ఫోన్ చేసింది. పోలీసుల విచారణలో ఈ ఫోన్ కాల్ కీలకంగా మారింది. రాత్రి 9.50 గంటల సమయంలో బాధితురాలి సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. అంతకు ముందు ఆమె చేసిన చివరి కాల్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె నలుగురు నిందితుల్లో ఒకరి ఫోన్ నెంబర్‌కు కాల్ చేసినట్టు తెలిసింది. దీంతో ఆ ఫోన్ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడంతో కేసు చిక్కుముడి వీడింది.

First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>