Home /News /crime /

SHADNAGAR RAPE AND MURDER CASE POLICE CUFFLINKS TO SHADNAGAR POLICE STATION SB

షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బేడీలు... రాష్ట్ర చరిత్రలో తొలిసారి

షాద్ నగర్ పోలీస్ స్టేషన్

షాద్ నగర్ పోలీస్ స్టేషన్

స్టేషన్ గేటును మూసేశారు. గేటుకు వేయడానికి తాళాలు లేకపోవడంతో... దానికి బేడీలు వేశారు.

    షాద్‌నగర్ హత్యాచార ఘటన నిందితులు ప్రస్తుతం షాద్ నగర్ పోలీస్ స్టేషన‌లో ఉన్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, మహిళా, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. నిందితుల్ని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. నేరస్థుల్ని తమకు అప్పగించాలన్నారు. పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చుకొనేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు వారిని అదుపు చేయడం కష్టంగా మారింది.దీంతో జనాన్ని చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీ ఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. నిందితుల్ని వైద్య పరీక్షల నిమిత్తి ఆస్పత్రికి తరలించాల్సి ఉండగా... పరిస్థితి దానికి అనుకూలంగా లేకపోవడంతో... డాక్టర్లను ఆస్పత్రికి తీసుకొచ్చి మరి పరీక్షలు చేయించారు.

    ఇంకా వందల సంఖ్యలో నిరసనకారులు స్టేషణ్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పీఎస్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. అయితే ఏమాత్రం వెనక్కి తగ్గని నిరసనకారులు పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. స్టేషన్ గేటును మూసేశారు. గేటుకు వేయడానికి తాళాలు లేకపోవడంతో... దానికి బేడీలు వేశారు. పీఎస్ గేటుకు బేడీలు వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Crime, Crime news, Priyanka Reddy, Priyanka reddy murder, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు