షాద్ నగర్ నిర్భయ కేసు... బాధితుల ఇంటికి తాళం

అయితే తాజాగా తమ ఇంటికి ఎవరూ రావొద్దంటూ బాధితులు తాళం వేసుకున్నారు. తమకు ఎవరి పరామర్శలు వద్దన్నారు.

news18-telugu
Updated: December 1, 2019, 9:57 AM IST
షాద్ నగర్ నిర్భయ కేసు... బాధితుల ఇంటికి తాళం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
షాద్‌నగర్ నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి బాధితుల ఇంటికి రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు క్యూ కట్టారు. నిర్భయ ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల్ని పరారమర్శించారు. తెలంగాణ గవర్నర్, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని సహా పలువురు అధికారులు, నేతలు పరామర్శించారు. అయితే తాజాగా తమ ఇంటికి ఎవరూ రావొద్దంటూ బాధితులు తాళం వేసుకున్నారు. తమకు ఎవరి పరామర్శలు వద్దన్నారు. మా బతుకు మాకు బతకనివ్వండి అంటూ.. ఇంటికి తాళం వేసుకున్నారు.

తమ ఇంట్లోకి రాజకీయ నాయకులతో పాటు మీడియా, పోలీసులు, బయటి వ్యక్తులు రావద్దంటూ ఇవాళ ఉదయం ఇంటికి బోర్డును తగిలించి, ఇంటి గేటుకు లోపలి నుంచి తాళం వేసుకున్నారు. తమ బిడ్డను ఎవరూ తిరిగి తీసుకు రాలేరని, తమకు న్యాయం కావాలని, పరామర్శలు వద్దని వారు చెబుతున్న పరిస్థితి.  తమ ఆవేదనను అర్థం చేసుకోకుండా, వచ్చి విసిగిస్తున్నారని ప్రియాంక కుటుంబీకులు వాపోయారు. అయితే ఇవాళ కూడా పలువురు నాయకులు బాధితురాలి ఇంటికి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. మరి వీరికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చూడాలి.

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>