హోమ్ /వార్తలు /క్రైమ్ /

షాద్ నగర్ నిర్భయ ఘటన : ఆమె కనీసం దానికి కూడా నోచుకోలేదు..

షాద్ నగర్ నిర్భయ ఘటన : ఆమె కనీసం దానికి కూడా నోచుకోలేదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రియాంకకు జంతువులంటే ఇష్టమని.. అందుకే మెడిసిన్ సీట్ వచ్చినా అందులో చేరలేదన్నారు. జంతువులపై ఇష్టంతో వెటర్నరీ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం తెచ్చుకుందన్నారు.

షాద్ నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ హత్యోదంతం ఆమె కుటుంబంలో తీరని విషాదం నింపింది.నిన్న మొన్నటిదాకా కళ్లముందు కనిపించిన ఆమె.. ఇక మళ్లీ కనిపించదనే చేదు నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.తాజాగా మీడియాతో మాట్లాడిన మృతురాలి మామ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సాధారణంగా తమ కులంలో పెళ్లి కాని వారు చనిపోతే చెట్టుతో పెళ్లి చేసి.. ఆపై దహన సంస్కారాలు నిర్వహిస్తామన్నారు. కానీ ఆమె దానికి కూడా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామన్నారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత ఎంతటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. ఇలాంటి ఘటనలు జరగడం తీవ్ర శోచనీయం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ఘటనపై స్పందించకపోవడం విచారకరం అన్నారు.

ప్రియాంకకు జంతువులంటే ఇష్టమని.. అందుకే మెడిసిన్ సీట్ వచ్చినా అందులో చేరలేదన్నారు. జంతువులపై ఇష్టంతో వెటర్నరీ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం తెచ్చుకుందన్నారు. ఇంట్లో జంతువులను పెంచుకోవడం ఆమెకు ఇష్టమని,కానీ ఇల్లు చిన్నది కావడం వల్ల కుదరలేదని అన్నారు. తండ్రి ఉద్యోగ రీత్యా వారానికోసారి మాత్రమే ఇంటికి వచ్చి వెళ్తుంటారని చెప్పారు. ఆమెకు మూడేళ్ల క్రితం జాబ్ రావడంతో కుటుంబాన్ని శంషాబాద్‌కి షిఫ్ట్ చేసిందన్నారు.

First published:

Tags: Priyanka reddy murder, Shadnagar, Telangana

ఉత్తమ కథలు