Home /News /crime /

SHADNAGAR MURDER CASE ACCUSED WIFE ALLEGEDLY HAD ILLICIT AFFAIR WITH DECEASED GARBAGE WASTE PAPER PICKER MKS

Shadnagar : చెత్త ఏరుకునే వ్యక్తితో వివాహిత అక్రమ సంబంధం.. భర్త బయటికెళ్లగానే ప్రతిరోజూ.. చివరికి ఏమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాళ్లంతా భర్తకు పరిచయస్తులే కావడంతో ఎవరికీ దగ్గరకాలేక చివరికి చెత్త కాగితాలు ఏరుకునే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం క్రమంగా అక్రమ సంబంధానికి దారితీసింది. చెత్త ఏరుకునే వ్యక్తే కాబట్టి ఎవరికీ ఎలాంటి అనుమాలుండవని ఆమె భావించింది. ప్రతిరోజూ భర్త బయటికి వెళ్లగానే.. చెత్త ఏరుకునే నెపంతో ఇతడు అటుగా వెళ్లి ఇంట్లోకి దూరేవాడు. అయితే తప్పు ఎప్పటికైనా బయటపడుతుందన్నట్లు, చివరికి వాళ్ల విషయం భర్తకు తెలిసింది.

ఇంకా చదవండి ...
అతనికి ఊళ్లో కొద్దో గొప్పో గుర్తింపు ఉంది.. కాలనీలో అందరికీ పరిచయస్తుడు కావడంతో వచ్చే పోయే దారిలో పలకరింపులు కామన్.. క్రమం తప్పకుండా పనికి వెళ్లేవాడు.. కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. భార్యకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఇంటికే తెచ్చిపెట్టేవాడు.. అయితే, ఏం ఆలోచించిదో ఏమోగానీ ఆ ఇల్లాలు తనకున్నదానితో సంతృప్తి పడలేదు. భర్తతో సంసారం సజావుగా సాగుతున్నట్లు కనిపించినా, అదుపుతప్పిన శారీరక వాంఛను ఆమెను దారి తప్పేలా చేశాయి. వీధిలో ఉన్నవాళ్లంతా భర్తకు పరిచయస్తులే కావడంతో ఎవరికీ దగ్గరకాలేక చివరికి చెత్త కాగితాలు ఏరుకునే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం క్రమంగా అక్రమ సంబంధానికి దారితీసింది. చెత్త ఏరుకునే వ్యక్తే కాబట్టి ఎవరికీ ఎలాంటి అనుమాలుండవని ఆమె భావించింది. ప్రతిరోజూ భర్త బయటికి వెళ్లగానే.. చెత్త ఏరుకునే నెపంతో ఇతడు అటుగా వెళ్లి ఇంట్లోకి దూరేవాడు. అయితే తప్పు ఎప్పటికైనా బయటపడుతుందన్నట్లు, చివరికి వాళ్ల విషయం భర్తకు తెలిసింది. పద్దతి మానుకోవాల్సిందిగా నచ్చ చెప్పాడు. వినలేదు. ఆ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయి రక్తపాతానికి దారితీసింది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వివరాలివి..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో రెండు రోజుల కిందట ఓ హత్యోదంతం కలకలం రేపింది. ఓ పాడుబడ్డ ఇంటిలో వ్యక్తి దారుణహత్యకు గురికావడాన్ని చూసి స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఎంటరయ్యారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత చనిపోయిన వ్యక్తిని నాగరాజు(40)గా గుర్తించారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన అతను ఒంటరిగానే షాద్ నగర్ లో నివసిస్తూ రోడ్ల పక్కన చెత్త, చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం కొనసాగించేవాడు. గురువారం రాత్రి నాగరాజు హత్య జరగ్గా, శనివారం రాత్రి నాటికి ఈ కేసులో అనూహ్య కోణాలు వెలుగులోకి వచ్చాయి.

shocking : Omicron భయంతో భార్య గొంతు నులిమి, ఇద్దరు పిల్లల పుర్రెలు పగలగొట్టిన ఫొరెన్సిక్ ప్రొఫెసర్స్థానిక పటేల్ రోడ్డులోనే నివసించే ఓ వివాహితతో నాగరాజు వివాహేతర బంధం కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. భర్తతో కలిసుంటోన్న సదరు మహిళ.. అతను పని మీద బయటికెళ్లగానే ప్రియుణ్ని ఇంటికి పిలిపించుకునేదని, రోజులుగా సాగుతోన్న ఈ వ్యవహారం ఆ కంటా ఈ కంటా పడి చివరికి భర్తకు తెలియడంతో కోపోద్రిక్తుడయ్యాడు. నాగరాజుతో సంబంధం మానుకోవాలని భార్యకు ఎన్నిసార్లు చెప్పి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ భర్త.. భార్య ప్రియుణ్ని అంతం చేయాలనుకున్నాడు.

Hyderabad : చూడ్డానికి అమాయకంగా ఉన్నారు కదా! చేసింది తెలిస్తే ఛీకొడతారు!! -హీరో సూర్యలాగాపలేట్ నగర్ లోనే ఓ పాడుబడ్డ ఇంట్లో నాగరాజు జీవిస్తుండగా, గురువారం రాత్రి అక్కడికెళ్లిన మహిళ భర్త.. విచక్షణారహితంగా దాడి చేశాడు. నాగరాజును కొట్టి కొట్టి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు.. హత్యపై దర్యాప్తు చేయగా, మహిళతో వివాహేతర సంబంధం, ఆమె భర్తే హంతకుడని తేలింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని షాద్ నగర్ పోలీసులు చెబుతున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Murder case, Rangareddy, Shadnagar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు