షాద్ నగర్ వెటర్నరీ డాక్టర్ లైంగిక దాడి హత్య కేసులో జిల్లా బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులకు ఎవరూ న్యాయ సహాయం చేయకూడదని తీర్మానించారు. నిందితులకు కఠిన శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికాసేపట్లో ఈ హత్యకేసు నిందితులను షాద్‌నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. యువతిపై నలుగురు కాకుండా ఐదుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు కోసం రెండు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ గేట్ వద్దకు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. నిందితులను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేస్తున్నారు. నిందితులకు కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఏపీ తెలంగాణలో విద్యార్థులు ర్యాలీలు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.