నెట్టింట్లో శృంగార ప్రసారాలు...లైవ్‌లో పడకగది గుట్టు రట్టు చేస్తున్న కపుల్స్...

ఒకప్పుడు కేవలం శృంగార సాహిత్యం, వీడియోలకు మాత్రమే పరిమితమైన ఈ ట్రెండ్ ప్రస్తుతం పడకగదిలో సెక్స్‌ను పలు సోషల్ మీడియా యాప్స్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చే స్థాయికి దిగజారింది.

news18-telugu
Updated: July 27, 2019, 11:20 PM IST
నెట్టింట్లో శృంగార ప్రసారాలు...లైవ్‌లో పడకగది గుట్టు రట్టు చేస్తున్న కపుల్స్...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 27, 2019, 11:20 PM IST
నాలుగు గోడల మధ్య జరగాల్సిన శృంగారం నెట్టింట్లో అందరూ చూస్తుండగా లైవ్ స్ట్రీమ్ ఇచ్చే స్థాయికి సంస్కృతి దిగజారి పోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా యాప్స్ ద్వారా శృంగారం చేస్తూ లైవ్ ద్వారా స్ట్రీమింగ్ ఇచ్చేందుకు మన దేశంలో యూత్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు కేవలం శృంగార సాహిత్యం, వీడియోలకు మాత్రమే పరిమితమైన ఈ ట్రెండ్ ప్రస్తుతం పడకగదిలో సెక్స్‌ను పలు సోషల్ మీడియా యాప్స్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చే స్థాయికి దిగజారింది. అయితే ఈ విషయంలో కపుల్స్ సైతం సిగ్గుపడటం లేదు. కొందరు ముఖాలకు మాస్కులు వేసుకొని లైవ్ స్ట్రీమింగ్ లో సెక్స్ ఇస్తుంటే, మరి కొందరు మాత్రం కెమెరా యాంగిల్స్ సెట్ చేసుకొని ముఖాలు కనిపించకుండా ప్రసారాలను నెట్ లో ప్రసారం చేసేస్తున్నారు. ఈ ప్రమాదకరమైన ట్రెండ్ తొలినాళ్లలో విదేశాల్లో మాత్రమే ఉండేది. అయితే రాను రాను మన దేశంలో కూడా ఇది ప్రమాదకర స్థాయిలో విస్తరించింది. కొన్ని చిన్న చితకా వెబ్ సైట్లు, యాప్స్ లైవ్ స్ట్రీమింగ్ శృంగారం చేసే కపుల్స్ కు డబ్బులు చెల్లిస్తూ వారిని లైవ్ స్ట్రీమింగ్ చేసేలా ప్రోత్సాహమిస్తున్నాయి. ఇటీవల గూగుల్ సెర్చింజన్ ద్వారా ఈ తరహా పడకగది శృంగారాన్ని లైవ్ ద్వారా అందించే వెబ్ సైట్లను భారత్ లోనే అత్యధిక సంఖ్యలో సెర్చ్ చేస్తున్నట్లు తేలింది.

అంతేకాదు అలాంటి సైట్స్‌కు మంచి ట్రాఫిక్ కూడా లభిస్తుండటంతో కొందరు రెచ్చిపోతున్నారు. అయితే ఈ విష సంస్కృతి అంత మంచిది కాదని సామాజిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు. కానీ డబ్బుకోసం కొన్ని వెబ్ సైట్స్ చేయిస్తున్న పనికి కొందరు ఈజీగా లొంగిపోవడం ఆందోళన కరంగా మారింది. నిజానికి మనదేశంలో అమలులో ఉన్న చట్టాల ప్రకారం శృంగార వీడియోలను ప్రసారం చేయడం, ఇతరులకు పంపడం నేరం. అలాగే భాగస్వామి అంగీకారం లేకుండా వీడియో తీయడం కూడా నేరమే. 2008 ఐటీ చట్టం  సెక్షన్‌ 67(ఏ) ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం. ఒక వేళ రుజువైతే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...