పూజల పేరుతో బాలికపై లైంగిక దాడి... ప్రకాశం జిల్లాలో దారుణం

లంకె బిందెలు దొరుకుతాయని నమ్మించిన మోసగాడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

news18-telugu
Updated: May 26, 2020, 6:31 PM IST
పూజల పేరుతో బాలికపై లైంగిక దాడి... ప్రకాశం జిల్లాలో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రకాశం జిల్లాలో దొనకొండ మండలంలో దారుణం జరిగింది. లంకె బిందెలు దొరుకుతాయని రుద్రసముద్రం గ్రామంలోని బాలరాజు అనే వ్యక్తిని నమ్మించిన విష్ణువర్ధన్... అతడి ఇంట్లో పూజలు చేయాలని చెప్పాడు. విష్ణువర్ధన్ మాటలను నమ్మిన బాలరాజు... అతడు చెప్పినట్టు చేశాడు. రాంబాబు 13 ఏళ్ల కూతురిపై కన్నేసిన విష్ణువర్ధన్... బాలికతో పూజలు చేయిస్తే లంకె బిందెలు తొందరగా దొరుకుతాయని నమ్మించాడు. ఆ నెపంతో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కూతురు ఇదే విషయాన్ని బాలరాజుకు చెప్పినా... నిధి దొరుకుతుందనే ఆశతో అతడు పట్టించుకోలేదు. దీనిపై ప్రశ్నించిన ఇరుగుపొరుగువారిని కూడా బాలరాజు బెదిరించాడు.

అయితే విషయం బయటకు పొక్కుతుండటంతో వేరే ఊరికి వెళ్లేందుకు విష్ణువర్ధన్, బాలరాజు ప్రయత్నించారు. బాలికను కూడా తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే బాధితురాలి తల్లి దొనకొండ పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో... పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు.

First published: May 26, 2020, 6:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading