సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి లైంగిక వేధింపులు...మాట వినలేదని క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడంటే...

ఆమెకు రోజూ వాట్సప్ ద్వారా మెసేజీలు చేస్తూ స్నేహితులమవుదాం అంటూ ప్రతిపాదన చేశాడు. పెద్దగ పరిచయమే లేని వ్యక్తులతో స్నేహమేంటని బాధిత యువతి, అంగీకరించలేదు. దీన్ని ఆవమానంగా భావించిన ఆ నిందితుడు ఆమెను వేధించడం ప్రారంభించాడు.

news18-telugu
Updated: October 22, 2019, 10:00 PM IST
సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి లైంగిక వేధింపులు...మాట వినలేదని క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడంటే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతికి క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన గురుగ్రామ్ లో చోటు చేసుకుంది. బాధితురాలు పూనం (పేరు మార్పు)ను రోజు ఆఫీసు నుంచి హాస్టల్ వరకూ దింపే క్యాబ్ డ్రైవర్ ప్రతాప్ (పేరు మార్పు) ఆమెపై కన్నేశాడు. ఈ క్రమంలో ఆమె ఫోన్ నెంబర్ సంపాదించాడు. ఆమెకు రోజూ వాట్సప్ ద్వారా మెసేజీలు చేస్తూ స్నేహితులమవుదాం అంటూ ప్రతిపాదన చేశాడు. పెద్దగ పరిచయమే లేని వ్యక్తులతో స్నేహమేంటని బాధిత యువతి, అంగీకరించలేదు. దీన్ని ఆవమానంగా భావించిన ఆ నిందితుడు ఆమెను వేధించడం ప్రారంభించాడు. తరచూ కొత్త నెంబర్లనుంచి ఫోన్ చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. అలాగే ఆమెకు అశ్లీల వీడియోలను సైతం సోషల్ మీడియా ద్వారా పంపేవాడు. దీంతో పలు మార్లు హెచ్చరించినా వినకపోవడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు