ఎట్టకేలకు చిక్కాడు.. లైంగిక వేధింపుల కేసులో బాసర ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్ట్

ప్రశ్నా పత్రాల లీకేజీలోనూ రవి వరాలపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి మరో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: July 12, 2019, 8:26 AM IST
ఎట్టకేలకు చిక్కాడు.. లైంగిక వేధింపుల కేసులో బాసర ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 12, 2019, 8:26 AM IST
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రవి వరాల ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్‌ బండ్లగూడలోని బంధువుల ఇంట్లో తలదాచుకున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి వరాలతో పాటు ట్రిపుల్ ఐటీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రవి వరాల ఆచూకీ కోసం కొద్దిరోజులుగా స్పెషల్ పోలీస్ టీమ్స్ గాలిస్తున్నాయి.

ట్రిపుల్ ఐటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీహరి ఫిర్యాదు మేరకు రవి వరాలపై కేసు నమోదైంది.నిర్భయ చట్టంతో పాటు పోక్సో, ఐటీ చట్టాల కింద అతనిపై కేసులు నమోదయ్యాయి. ప్రశ్నా పత్రాల లీకేజీలోనూ రవి వరాలపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి మరో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు పరీక్షలు సరిగా రాయని విద్యార్థులను గుర్తించి.. డబ్బులిస్తే చూసి పరీక్ష రాసేందుకు సహకరిస్తామని చెప్పేవారని వెల్లడించారు. అలా ఒక్కో విద్యార్థి నుంచి రూ.10వేల నుంచి రూ.15వేలు వరకు వసూలు చేసేవారని తెలిపారు. ఐపీసీ 420,409 సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ఇది కూడా చదవండి : నా ఇంటికొస్తే పాస్ చేస్తా... బాసర త్రిబుల్ ఐటీలో కీచక ప్రొఫెసర్

First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...