పూజారులు, ఫాస్టర్లు ఇటివల వీళ్లే వార్తల్లోకి ఎక్కుతున్నారు.. ప్రజలను సన్మార్గంలో నడిపించాల్సిన వారే అడ్డదారులు తొక్కుతున్నారు. తమ సమస్యల కోసం దేవుడికి చెప్పుకునేందుకు వస్తే... వారిని వంచించి మోసం చేస్తున్నారు. దీంతో ఇటివల పూజారులు, ఫాస్టర్లు కొంతమంది తమ వ్యక్తిగత స్వార్థంతో మొత్తం సొసైటికి మచ్చ తెస్తున్న సంఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఓ పూజారీ తన వద్దకు పెళ్లి కావడం లేదు సంబంధాలు చూడాలని దరికి చేరితే ఆ పూజారీ మాయమాటలు చెప్పి శారీరక అవసరాలు తీర్చుకున్నాడు.. ఇప్పుడు అదే తంతు ఫాస్టర్ వంతైంది.
సిస్టర్ను మోసం చేసిన ఫాస్టర్
నల్గోండ జిల్లా మిర్యాల గూడలో ఓ యువతితో లైంగికంగా సంబంధాలు కొనసాగించిన తర్వాత పెళ్లి చేసుకునేందుకు ఓ ఫాస్టర్ నిరాకరించాడు. దీంతో ఆ యువతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..నల్గొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన హనుమాన్ పేటలోని హోసన్న చర్చిలో ఓ యువతి గత ఐదేళ్లుగా సిస్టర్‌గా సేవలు అందిస్తోంది. అయితే ఏపీ కడప జిల్లాకు చెందిన దార నతానియోల్ అదే చర్చిలో ఫాదర్‌గా సేవలు అందిస్తున్నాడు. దీంతో ఆమెతో ఫాస్టర్ గతకొద్దికాలంగా శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు.. తర్వాత సహజీవనం అన్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. కాని రోజులు గడుస్తున్నా కొద్ది ముఖం చాటేస్టున్నాడు.. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని స్థానిక పెద్దల సహాయంతో గట్టిగా నిలదీయడంతో అసలు తనకు సంబంధం లేనట్టుగా ఫాస్టర్ వ్యవహరించాడు. పైగా ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో పెద్ద మనుష్యులు కూడా ఏం చేయలేక పోలీసు స్టేషన్ లో కేసు పెట్టాలని సూచించారు. దీంతో ఫాస్టర్ పై చర్యలు తీసుకుని తనకు తగిన న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పూజారీ వద్దకు వెళ్లినా.. ఇదే పరిస్థతి..
కాగా రెండు రోజుల క్రితమే ఇలా నగరంలో జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దమ్మాయిగూడలో నివసించే ఓ యువతి తనకు పెళ్లి కావడం లేదని స్థానికంగా ఉండే ఓ పురోహితుడి వద్దకు వెళ్లింది. తనకు పెళ్లి కావడం లేదని ఏవైనా మంచి సంబంధాలు ఉంటే చెప్పాలని వెళ్లింది. దీంతో మంచి సంబంధాల మాటున ఆయువతిని తన మాయమాటలతో లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని శారీరక అవసరాలు తీర్చుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోమని గట్టిగా నిలదీస్తే... కొద్ది రోజులుగా కనిపించకుండా పోయాడు.. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులతో ఆ పురోహితుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Nalgonda