ఏలూరులో గుట్టుగా వ్యభిచారం... యువతిని తీసుకొచ్చి

గొల్లాయిగూడెం గృహకల్ప హౌసింగ్‌ కాలనీలో పుట్టా నీలవేణి అనే 36 ఏళ్ల మహిళ కొంతకాలం నుంచి వ్యభిచారం నిర్వహిస్తుంది.

news18-telugu
Updated: December 7, 2019, 8:11 AM IST
ఏలూరులో గుట్టుగా వ్యభిచారం... యువతిని తీసుకొచ్చి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పశ్చిమగోదావరి జిల్లాలో గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచారాన్ని పోలీసులు రట్టు చేశారు. ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వన్‌ టౌన్‌ సీఐ  వై. బాల రాజాజీకి సమాచారం అందడంతో ఎస్‌ఐ ఎన్‌ఆర్‌ కిశోర్‌ బాబు సిబ్బందితో కలిసి నిన్న రాత్రి దాడికి దిగారు. ఏలూరు వంగాయ గూడెం సమీపంలోని గొల్లాయిగూడెం గృహకల్ప హౌసింగ్‌ కాలనీలో పుట్టా నీలవేణి అనే 36 ఏళ్ల మహిళ కొంతకాలం నుంచి వ్యభిచారం నిర్వహిస్తుంది.  శుక్రవారం కూడా  25 ఏళ్ళ యువతిని తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తోంది.

దీంతో సమాచారం అందుకున్న పోలీసులు నీలవేణి ఇంటిపై దాడి చేశారు. అక్కడ విటులుగా ఉన్న ఏలూరు శాంతినగర్‌‌కు చెందిన యువకుడు, తాడేపల్లిగూడెంలోని బొమ్మిడికి చెందిన యువకుడు, ఏలూరు దొంగలమండపం ప్రాంతానికి చెందిన ఆయు ర్వేద వైద్యుడిని అరెస్టు చేశారు. వారితోపాటు నిర్వాహకురాలు నీలవేణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న యువతిని పోలీసులు సంరక్షణ హోమ్‌కు తరలించారు.


First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>