SEX RACKET WAS GOING ON IN FRONT OF THE POLICE STATION IN MADHYA PRADESH THIS IS HOW IT WAS BUSTED SK
పోలీస్ స్టేషన్ ఎదురుగానే వ్యభిచారం.. ఫొటో చూసి అమ్మాయిల రేటు ఫిక్స్.. ఎలా దొరికారంటే..
పోలీసుల అదుపులో అమ్మాయిలు
Sex Racket Busted: వీరిలో ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాడు. అమ్మాయి వయసు, పర్సనాలిటీని బట్టి రేటు ఉంటుందని అతడు వివరించాడు. వెయ్యి నుంచి రూ.5 వేల వరకు రేట్లు ఉన్నాయని ఫొటోలు చూపించాడు
అక్కడ ఓ పోలీస్ స్టేషన్ ఉంది. దాని ఎదురుగా గెస్ట్ హౌస్ ఉంది. అప్పుడప్పుడూ కొందరు వచ్చి వెళ్తుంటారు. ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు. అది ప్రైవేట్ ప్రాపర్టీ.. దాని గురించి మనకు ఎందుకులే అని లైట్ తీసుకున్నారు. అక్కడ ఏం జరుగుతుందోనని ఎవరికీ డౌట్ రాలేదు. ఎందుకంటే అది పోలీస్ స్టేషన్‌కు ఎదరుగానే ఉంది. చుట్టూ పోలీసులే ఉంటారు. అలాంటి చోట ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగవని అనుకున్నారు. కానీ ఇటీవల పోలీసులు రైడ్ చేసి.. సెక్స్ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ న్యూస్ తెలిసి స్థానికులు షాక్ అయ్యారు. ఏంటి పోలీసు ముందే ఇంత తతంగం జరుగుతోందా..? అని నోరెళ్లబెట్టారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది.
గ్వాలియర్‌లోని పడవా పోలీస్ స్టేషన్ ముందు పాఠఖ్ పేరుతో ఓ గెస్ట్ హౌస్ ఉంటుంది. గెస్ట్ హౌస్ అంటే.. మీటింగ్‌లకు, చిన్న చిన్న పార్టీలకు రెంట్‌కు ఇస్తారని మాత్రమే బయటకు తెలుసు. కానీ లోపల జరిగేది వేరే కథ. అక్కడ అమ్మాయిల శరీరాలతో గలీజు దందా చేస్తున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారు. చాలా రోజులుగా ఈ తతంగం జరుగుతున్నా ఎప్పుడూ కేసు కాలేదు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నా తెలియలేదు. ఎందుకంటే ఆ గెస్ట్ ఓనర్ వీరికి మామూళ్లు ఇచ్చే వారని స్థానికులు చెప్పారు. ఐతే ఇటీవల వరుసగా ఫిర్యాదులు రావడంతో నేరుగా జిల్లా ఎస్పీయే రంగంలోకి దిగారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంనేదుకు పక్కాగా స్కెచ్ చేశారు.
ఓ పోలీస్ అధికారిని మఫ్టీలో అక్కడికి పంపి.. తనకు అమ్మాయిలు కావాలని చెప్పారు. ఇక్కడ అలాంటివేమీ ఉండవని మొదల ఆ మేనేజర్ చెప్పాడు. చాలా దూరం నుంచి వచ్చాను.. ఇక్కడ అదంతా కామన్ అంట కదా.. అని అడగడంతో.. లోపలి నుంచి ఫొటోలు తీసుకొచ్చాడు. వీరిలో ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాడు. అమ్మాయి వయసు, పర్సనాలిటీని బట్టి రేటు ఉంటుందని అతడు వివరించాడు. వెయ్యి నుంచి రూ.5 వేల వరకు రేట్లు ఉన్నాయని ఫొటోలు చూపించాడు. లోపల వ్యభిచారమే జరుగుతోందని నిర్ధారించుకున్న తర్వాత మఫ్టీలో ఉన్నఆ పోలీస్.. అధికారులకు సిగ్నల్ ఇచ్చారు. వారు వెంటనే గెస్ట్ హౌస్‌ను రైడ్ చేసి సెక్స్ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేశారు. మేనేజర్‌తో పాలు నలుగురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. గెస్ట్ హౌస్ నుంచి కండోమ్‌లు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
మేనేజర్ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. వ్యభిచారం నుంచి వచ్చిన ఆదాయంలో సగం డబ్బును ఆ అమ్మాయిలు ఇస్తారు. మిగతా సగం డబ్బులను ఓనర్ తీసుకుంటాడు. ఇలా ఎంతో మంది అమాయక అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి.. వ్యభిచారంలోకి దించినట్లు తెలుస్తోంది. పోలీసులు రైడ్ చేశారని తెలిసి.. ఆ గెస్ట్ హౌస్ పారిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.