Home /News /crime /

దారి తప్పిన పోలీసులు.. పక్కా స్కెచ్ తో యువకులకు అమ్మాయిలను ఎరవేసి..

దారి తప్పిన పోలీసులు.. పక్కా స్కెచ్ తో యువకులకు అమ్మాయిలను ఎరవేసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరు పోలీసులు డబ్బు కోసం తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. కొందరు అమ్మాయిలను బెదిరించి భయపెట్టి సెక్స్ రాకెట్ ను సృష్టించారు. ఆ అమ్మాయిలతో యువకులను టార్గెట్ చేయించి.. వారిని రప్పించి..

    తప్పుదారి పడుతున్న యువతను మందలించి దారిలోకి తీసుకురావాల్సిన పోలీసులే పెడదోవ పడ్డారు. డబ్బు కోసం పక్కా స్కెచ్ లు గీస్తున్నారు. తమ అధికారాన్ని వాడుకుంటూ అమ్మాయిలను సెక్స్ రాకెట్ లోకి దించుతున్నారు. ఆ అమ్మాయిలతో యువకులను ట్రాప్ చేయిస్తున్నారు. అమ్మాయిలతో కలిసి ఉన్న యువకులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని డబ్బు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తు గురించి భయపడి ఆ యువత ఎలాగోలా ఆ పోలీసులు అడిగిన డబ్బును ఇచ్చేసి పారిపోతున్నారు. తప్పు చేసిన వాళ్లు ఎప్పటికైనా దొరికిపోతారన్నట్టుగా వారి బండారం కూడా బయటపడింది. సీనియర్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. చివరకు ఉద్యోగాలను ఊస్ట్ చేయించుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిట్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిట్ జిల్లాలో ఓ పోలీస్ అధికారులకు సంబంధించిన అతిథి గృహం ఉంది. దీన్ని ఓ ఇద్దరు కానిస్టేబుల్స్ దుర్వినియోగానికి ఉపయోగిస్తున్నారు. వారిద్దరూ కలిసి రాత్రిళ్లు బయట కనిపించే అమ్మాయిలను ప్రశ్నలతో వేధించేవాళ్లు. వాళ్లల్లో ఎవరైనా కాస్త భయపడినట్టు కనిపిస్తే వెంటనే వారిని మరింత భయపెట్టేవారు. తాము చెప్పినట్టు వినాలని డిమాండ్ చేసేవాళ్లు. అలా కొందరు అమ్మాయిలతో సెక్స్ రాకెట్ నే సృష్టించారు. యువతను, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం వారి పని. అలా వారిని ఆకర్షించి పోలీసు అతిథి గృహం వద్దకు అమ్మాయిల కోసం వచ్చేలా చేసేవాళ్లు.

    మొత్తానికి అనుకున్నట్టుగా యువకులు అమ్మాయిల కోసం ఆ అతిథి గృహానికి వచ్చి వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఈ పోలీసులు రైడ్ కు వచ్చేవాళ్లు. అమ్మాయిలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో టెన్షన్ తో ఉన్న యువకులు, బడా వ్యాపారవేత్తల నుంచి డబ్బును డిమాండ్ చేసేవాళ్లు. పోలీసులు చెప్పినంత ఇచ్చి అక్కడి నుంచి వారు పరారయ్యేవారు. ఇలా కొంత కాలంగా వీరు ఈ దందాను నిర్వహిస్తున్నారు. వీరి ఆగడాలను భరించలేక ఓ మహిళ తన ఆవేదనను ఓ ఆడియో రికార్డింగ్ ద్వారా బయటపెట్టింది. ఇదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఈ ఘటనపై సూపరిండెంట్ పోలీస్ జై ప్రకాశ్ యాదవ్ విచారణ జరిపించారు. ఇది నిజమేనని తేలడంతో ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ను ఉద్యోగాల్లోంచి తొలగించారు. అంతేకాకుండా ఈ పోలీసు అతిథి గృహం వద్ద విధుల్లో అలసత్వం వహించిన కారణంగా మరికొందరుపోలీసులను అక్కడి నుంచి బదిలీ చేశారు. మొత్తానికి ఈ ఘటన కాస్తా ఉత్తర ప్రదేశ్ పోలీసుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Husband kill wife, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు