వ్యభిచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా స్పాలు.. మహిళా కమిషన్ సీరియస్..

పైకి కనిపించేది స్పా.. లోపల నడిపించేది మాత్రం వ్యభిచారం. ఒక్కటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో స్పాల పేరుతో వ్యభిచార గృహాలు నడుస్తున్నాయక్కడ. అక్కడున్న దాదాపు స్పాలు వ్యభిచారానికి అడ్డాగా మారిపోయాయట.

news18-telugu
Updated: September 18, 2019, 11:54 AM IST
వ్యభిచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా స్పాలు.. మహిళా కమిషన్ సీరియస్..
స్పాలలో వ్యభిచారంపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్
  • Share this:
పైకి కనిపించేది స్పా.. లోపల నడిపించేది మాత్రం వ్యభిచారం. ఒక్కటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో స్పాల పేరుతో వ్యభిచార గృహాలు నడుస్తున్నాయక్కడ. అక్కడున్న దాదాపు స్పాలు వ్యభిచారానికి అడ్డాగా మారిపోయాయట. అదెక్కడో కాదు.. దేశ రాజధాని ఢిల్లీలోనే. పోలీసులు చేపడుతున్న రైడింగ్‌లో పెద్దమొత్తంలో స్పాలలో సెక్స్ రాకెట్ దందాలు బట్టబయలు అవుతున్నాయి. ఈ దందాలపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సెక్స్ రాకెట్ దందాలపై వివరణ ఇవ్వాలని ముగ్గురు ఢిల్లీ మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబరు 20న తమ ముందు హాజరై పూర్తి వివరాలు అందించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, స్పాలల్లో సెక్స్ రాకెట్ దందాకు పోలీసులు కూడా కారణమేనని ఆమె ఆరోపించారు.

‘ఢిల్లీలో స్పాలలో నడుస్తున్న సెక్స్ రాకెట్‌పై మహిళా కమిషన్ యుద్ధం ప్రకటించింది. ఆ దందాకు వ్యతిరేకంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. కానీ, ఢిల్లీ మునిసిపల్ కమిషనర్, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దేశ రాజధానిలో ఈ భూతాన్ని తరిమికొట్టే వరకు వారిని నిద్రపోనివ్వం’ అని స్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు