ఆర్మీ జవాన్ ఇంట్లో సెక్స్ రాకెట్... ఒక్కో కస్టమర్ నుంచి రూ.3000

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ జవాన్ ఇంటిని సెక్స్ రాకెట్ నిర్వహించే ఓ ముఠా అద్దెకు తీసుకుంది.

news18-telugu
Updated: January 12, 2020, 8:25 PM IST
ఆర్మీ జవాన్ ఇంట్లో సెక్స్ రాకెట్... ఒక్కో కస్టమర్ నుంచి రూ.3000
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం అధికారులు ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. మీరట్‌లోని ఓ ఇంట్లో దాడులు చేయగా, భారీ సెక్స్ రాకెట్ బట్టబయలైంది. ఇద్దరు యువతులను, మరో ఇద్దరు విటులను వారు అరెస్ట్ చేశారు. సెక్స్ రాకెట్‌లో డ్యాన్సర్ కూడా ఉంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ జవాన్ ఇంటిని సెక్స్ రాకెట్ నిర్వహించే ఓ ముఠా అద్దెకు తీసుకుంది. మూడు నెలల క్రితం వారికి పెద్ద ఎత్తున అడ్వాన్స్ చెల్లించి అద్దెకు తీసుకున్నారు. అక్కడ వ్యభిచారం మొదలు పెట్టారు. అందులో ఓ హర్యానాకు చెందిన డ్యాన్సర్‌ను కూడా తీసుకొచ్చారు. ఆ బీఎస్‌ఎఫ్ జవాన్ ఇంటి చుట్టుపక్కల వారికి అనుమానం రావడంతో వారు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగానికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ ఇంట్లో దాడులు చేశారు. ఇద్దరు యువతులు (అందులో ఒకరు 17 సంవత్సరాల యువతి)ని, మరో ఇద్దరు విటులను పట్టుకున్నారు.

ఆ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నవారు తమ వద్దకు వచ్చే విటుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.2వేల నుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. హర్యానా, ఢిల్లీ నుంచి యువతులను రప్పించి, వారి ఫొటోలను , వారితో సెక్స్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలిపే వివరాలను కూడా తమ కస్టమర్లకు వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా చేరవేస్తున్నారు. కస్టమర్లు కోరుకుంటే వారికి నచ్చిన చోటకే యువతులను పంపుతున్నారు.

First published: January 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు