సెక్స్ రాకెట్ గుట్టు రట్టు...ముఠా చెర నుంచి ముగ్గురు యువతులకు విముక్తి

రంగంలోకి దిగిన పోలీసులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఒక విటుడితో పాటూ ముగ్గురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతులను ప్రశ్నించగా నెలవారి డబ్బులు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని చెప్పారు.

news18-telugu
Updated: October 12, 2019, 7:30 PM IST
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు...ముఠా చెర నుంచి ముగ్గురు యువతులకు విముక్తి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 12, 2019, 7:30 PM IST
ముగ్గురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠాను నెల్లూరు టౌన్‌లోని బాలాజీనగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నెల్లూరు హరనాథపురంకు చెందిన దాసరి శాంతమ్మ అనే మహిళ హరనాథపురంలోని ఓ అపార్ట్ మెంటులో నివాసం ఉంటోంది. ఈ క్రమంలోనే ఓ ముగ్గురు యువతులను అపార్ట్ మెంట్‌కు తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా వారిచే వ్యభిచారం చేయిస్తుంది. విటులు తరచూ అపార్ట్ మెంటు కు వచ్చిపోతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఒక విటుడితో పాటూ ముగ్గురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతులను ప్రశ్నించగా నెలవారి డబ్బులు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని చెప్పారు. దీంతో వ్యభిచారం గృహ నిర్వాహకురాలితో పాటు విటుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. వ్యభిచారం కోసం తీసుకొచ్చిన ముగ్గురు యువతులకు అక్కడి నుండి విముక్తి కల్పించారు.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...