సెక్స్ రాకెట్ గుట్టురట్టు...బంగ్లాదేశ్ యువతులతో మసాజ్ పేరుతో...చీకటి దందా

బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నిర్వాహకులతో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: July 1, 2020, 10:40 PM IST
సెక్స్ రాకెట్ గుట్టురట్టు...బంగ్లాదేశ్ యువతులతో మసాజ్ పేరుతో...చీకటి దందా
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కోల్ కతాలో మ‌సాజ్ సెంట‌ర్ల పేరుతో గుట్టు చప్పుడు కాకుండా నిర్వ‌హిస్తున్న వ్య‌భిచార‌ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వ్యభిచారంపై పక్కా సమాచారంతో పోలీసులు యూనిసెక్స్ సెలూన్&స్పాల పై దాడి చేశారు. నిర్వాహకులతో పాటు ఐదుగురు విదేశీ యువతులను అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే...మహేష్ కుమార్‌ అనే వ్యక్తి యూని సెక్స్‌ సెలూన్‌ అండ్‌ స్పా పేరుతో మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నిర్వాహకులతో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు వారి వ‌ద్ద నుంచి 8 సెల్‌ ఫోన్లు, రూ. లక్షన్నర నగదు స్వాధీనం చేసుకొని గురువారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
First published: July 1, 2020, 10:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading