హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు..

హైదరాబాద్‌లో తాజాగా ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

news18-telugu
Updated: December 10, 2019, 5:18 PM IST
హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు..
భార్య భర్తలే గత కొన్ని రోజుల నుంచి ఈ వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
  • Share this:
హైదరాబాద్‌లో తాజాగా ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో వ్యభిచారం చేయిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అక్కడి పీ అండ్ టీ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా మహిళలతో వ్యభిచారం నడిపిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎల్బీనగర్ ఎస్‌ఓటీ ఇన్స్‌‌పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచార గృహ నిర్వాహకుడు సహా ఇద్దరు కస్టమర్లు, మరో ఇద్దరు మహిళలు పట్టుబడ్డారు. వారివద్ద 3 సెల్‌ఫోన్లు, 22 కండోమ్ ప్యాకెట్లు, రూ.11,900 నగదు లభ్యమైంది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. కాగా, వ్యభిచారం చేస్తున్న మహిళలు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వారిగా పోలీసులు నిర్థారించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: December 10, 2019, 3:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading