హైదరాబాద్‌లో గుట్టుగా వ్యభిచారం.. ముంబై యువతులతో దందా..

హైదరాబాద్‌లో ఓ భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ముంబై నుంచి యువతులను రప్పించి, వారితో వ్యభిచారం నడిపిస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. నిర్వాహకుడితో పాటు ఆరుగురు యువతులు, నలుగురు విటులను అరెస్టు చేశారు.

news18-telugu
Updated: December 30, 2019, 10:09 AM IST
హైదరాబాద్‌లో గుట్టుగా వ్యభిచారం.. ముంబై యువతులతో దందా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో ఓ భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ముంబై నుంచి యువతులను రప్పించి, వారితో వ్యభిచారం నడిపిస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. నిర్వాహకుడితో పాటు ఆరుగురు యువతులు, నలుగురు విటులను అరెస్టు చేశారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాజస్థాన్‌‌కు చెందిన దీపక్‌ అనే వ్యక్తి.. కాటేదాన్‌లో నివాసం ఉంటున్నాడు. ఉప్పర్‌పల్లి ప్రాంతంలోని సన్‌రైజ్‌ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, ముంబై నుంచి అందమైన యువతులను రప్పించి వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. పక్కా సమాచారం అందుకుని ఆదివారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేశారు. ఎస్‌వోటీ పోలీసులు చేసిన ఈ దాడిలో.. ఆరుగురు యువతులు, నలుగురు విటులు, దీపక్ సహా మరో వ్యక్తి పట్టుబడ్డాడు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.

First published: December 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు