సెక్స్ రాకెట్ గుట్టు రట్టు... ఆ ముసుగులో...

స్పా పేరుతో వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు బట్టబయలు చేశారు.

news18-telugu
Updated: October 7, 2019, 5:31 PM IST
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు... ఆ ముసుగులో...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుట్టుచప్పుడు కాకుండా మహిళలను సెక్స్ రాకెట్‌లోకి దింపుతున్న పలు ముఠాలు... ఇందుకోసం కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తమ స్థావరాలను మారుస్తూ తమ చీకటి వ్యాపారాలను కొనసాగిస్తున్నాయి. అమాయక మహిళలను సెక్స్ రాకెట్ రొంపలోకి దింపి... భారీగా క్యాష్ చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ముఠా ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన సూత్రధారి కూడా ఓ మహిళే కావడం గమనార్హం. వాట్సాప్ ద్వారా మహిళలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంపించి విటులను ఆకర్షించడం ఈ సెక్స్ రాకెట్ ముఠా టార్గెట్.

ఘజియాబాద్ నగర పరిధిలోని మూడు స్పాలపై దాడి చేయడంతో ఈ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఇందిరాపురంలోని మూడు స్పాస్‌లపై జరిపిన దాడుల్లో 9 మంది యువతులు సహా, మొత్తం 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. యువతుల ఫోటోల ద్వారా విటులను స్పాలకు ఆహ్వానించి... ఈ చీకటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న యువతుల నుంచి రూ. 16 వేలను, 24 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మానవ అక్రమ రవాణా నివారణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


First published: October 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>