ఒకేరోజు ఏడు మందితో ఆ పని... ఢిల్లీలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు...

దేశరాజధాని ఢిల్లీలో సెక్స్ రాకెట్... ముగ్గురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ఇంటి యజమాని... పక్కింటి వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్‌తో విషయం వెలుగులోకి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 20, 2019, 9:30 PM IST
ఒకేరోజు ఏడు మందితో ఆ పని... ఢిల్లీలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశరాజధాని ఢిల్లీలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది.. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ మహిళా కమీషన్ కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో విస్తుగొలిపే నిజాలు బయటికి వచ్చాయి. మహిళా కమీషన్‌కు హెల్ప్‌లైన్ 181 నుంచి వ్యభిచార గృహం గురించి సమాచారం ఇస్తూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ ఆధారంగా ఫిర్యాదు నమోదుచేసుకుని, అమన్ విహార్ ఏరియాకు వెళ్లిన పోలీసులు.... అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు నిర్ధారణ చేసుకున్న తర్వాత దాడి చేశారు. ఉదయం 10:30 గం.ల సమయంలో సదరు ఇంట్లోకి నలుగురు యువకులు వెళ్తుండడం చూసిన పోలీసులు... 15 నిమిషాల తర్వాత అందులో ఒకతను బయటికి రావడం గమనించారు. ఆ తర్వాత స్కూటర్స్, బైక్‌ల మీద చాలామంది ఆ ఇంటికి, వస్తూ పోతుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు... దాడి చేశారు. ఇంటిలోపల ఏం జరుగుతుందో కనిపించకుండా ఉండేందుకు చుట్టూ వెదురుబొంగులతో గోడ నిర్మించారు నిర్వాహకులు.

వ్యభిచార గృహంలో ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... వ్యభిచారం చేస్తున్న ముగ్గురు యువతులను అరెస్ట్ చేశారు. ఇంటి యజమాని గౌతమ్... ముగ్గురు యువతులను తెప్పించి, వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు తేలింది. పోలీస్ రైడ్ అయిన వెంటనే బ్యాక్ డోర్ తెరిచి, నలుగురు యువకులను బయటికి పంపించాడు. ఒక్కో విటుడి నుంచి రూ.250 వసూలు చేస్తున్న గౌతమ్... సాధ్యమైనంత ఎక్కువ మందితో పడుకునేలా మహిళలపై ఒత్తిడి చేస్తున్నాడు. రోజుకి కనీసం 7 మంది క్లైయింట్స్‌తో సెక్స్ చేయించాల్సిందిగా ఫోర్స్ చేస్తున్నట్టు తెలిపారు మహిళలు. వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకున్న ఓ మహిళ... తాను అనాథనని, ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే... వాడు డ్రగ్స్‌కు బానిసై చిత్రవధ చేసేవాడని. కుటుంబాన్ని నడిపించేందుకు ఈ పనిని ఎంచుకున్నట్టు తన ధీనగాథను పోలీసులకు చెప్పింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
First published: April 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading