పెళ్లి చేసుకుంటానని చెప్పి శృంగారం.. ఒడిసా హైకోర్టు సంచలన తీర్పు..

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శృంగారం చేస్తే అది రేప్ కిందకు రాదని ఒడిసా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

news18-telugu
Updated: May 25, 2020, 7:45 AM IST
పెళ్లి చేసుకుంటానని చెప్పి శృంగారం.. ఒడిసా హైకోర్టు సంచలన తీర్పు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శృంగారం చేస్తే అది రేప్ కిందకు రాదని ఒడిసా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మహిళ తన ఇష్టంతోనే ఒక సంబంధం ఏర్పర్చుకొని భాగస్వామితో సెక్స్ చేయడాన్ని రేప్ కింద ఎలా లెక్కగడతారని వ్యాఖ్యానించింది. అయితే, ఇలాంటి సన్నిహిత సంబంధాలను నియంత్రించే నెపంతో అత్యాచార చట్టాలను వినియోగించడం కరెక్టా? కాదా? అన్నది తేల్చాల్సి ఉందని జస్టిస్ పాణిగ్రాహి వ్యాఖ్యానించారు. పరస్పర అంగీకారంతో కొనసాగే బంధాన్ని ఐపీసీ సెక్షన్ 376(రేప్) కింద నేరంగా పరిగణించలేమని అన్నారు. ఓ కేసులో నిందితుడికి బెయిల్ దరఖాస్తును అంగీకరిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఓ యువతిని నమ్మించి నాలుగేళ్లుగా ఆమెతో శృంగారం చేశాడు నిందితుడు. ఈ క్రమంలో ఆమె రెండు సార్లు గర్భం కూడా దాల్చింది.

అయితే, ఆ తర్వాత ఆమెను మోసం చేశాడు. పెళ్లి చేసుకోబోనని తెగేసి చెప్పాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో అతడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆర్నెళ్లుగా జైల్లో ఉంటూ తాజాగా బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పై వ్యాఖ్యలు చేశారు. అయితే, అమాయక యువతులు మోసగాళ్ల చేతిలో బలి అవుతున్నారని, ఆ క్రూరుల నుంచి కాపాడేందుకు రేప్ చట్టాలు పనికి రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మరిన్ని కఠిన చట్టాలు అవసరం ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
First published: May 25, 2020, 7:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading