Several Women Injured In Police Crackdown : బీహార్ రాష్ట్రంలోని లోని గయా జిల్లాలో దారుణం జరిగింది. అహత్పూర్ గ్రమంలోని మొర్హార్ నది ఒడ్డున ఇసుక తవ్వకంపై పోలీసులకు, గ్రామస్థులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇసుక గనుల వేలంలో ప్రభుత్వ అధికారులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసు అధికారులతో ఘర్షణ పడిన గ్రామస్తులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళలను కూడా చేతులు కట్టేసి దారుణంగా కొట్టారు. మంగళవారం జరగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పురుషులు, మహిళలకు సంకెళ్లు వేసి నేలపై కూర్చొపెట్టిన వీడియో ఆన్‌లైన్ లో దుమారం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఇసుక తవ్వాకాలపై టెండర్లలో హక్కులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు బలగాలతో నదీ తీరానికి చేరుకున్నారు. ఇసుకను వెలికితీయాల్సిన హద్దులు గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామస్థులు కల్పించుకున్నారు. గ్రామస్తులు వారిపై రాళ్లు రువ్వడం ప్రారంభించడంతో, గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.ఈ ఘర్షణల్లో 9 మంది పోలీసులు,25మందికి పైగా గ్రామస్థులు గాయపడ్డారు. గ్రామస్థులను సంఘ విద్రోహ శక్తులు ప్రేరేపించాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసులపై దాడికి పాల్పడిన 10 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ALSO READ Punjab Election : మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మన్మోహన్..అన్నింటికీ ఆయన్నే అంటారా!
అయితే పోలీసుల చర్య వల్ల గామాలపాలయ్యింది గ్రామస్థులేనని సమాచారం. పురుషులు, మహిళలకు సంకెళ్లు వేసి నేలపై కూర్చొపెట్టి లాఠీలతో కొట్టారు పోలీసులు. వర్షాకాలంలో నదీ ప్రవాహం పెరిగినప్పుడు ఇసుకకోతకు గురై గ్రామానికి ప్రమాదం ఉంటుందని శాంతియుతంగా మాట్లాడుతున్నప్పుడు పోలీసులు దాడి చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి దగ్గరగా ఇసుక తవ్వకం జరపొద్దని కోరగా... మాఫియాతో కలిసి పోలీసులు తమను విచక్షణారహితంగా కొట్టారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.