Home /News /crime /

SEVERAL PEOPLE SHOT AT IN WASHINGTON DC PVN

USA Firing : అమెరికాలో కాల్పుల బీభత్సం..పోలీస్ సహా పలువురిపై బుల్లెట్ల వర్షం

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

అమెరికాలో మరోసారి కాల్పుల కలకం రేగింది. రాజధాని వాషింగ్టన్ డీసీలో ఆగంతకుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.

అమెరికా(USA)లో మరోసారి కాల్పుల కలకం రేగింది. రాజధాని వాషింగ్టన్ డీసీ(Washington DC)లో వైట్ హౌస్(అమెరికా అధ్యక్ష భవనం)సమీపంలో ఇవాళ ఉదయం ఓ ఆగంతకుడు ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు(Gun Firing) జరిపాడు.వాషింగ్టన్​డీసీ 14 అండ్​ యూ వీధిలోని జునెటీంత్​ మ్యూజిక్​ కన్సెర్ట్​ సమీపంలో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు.ఈ ఘటనలో పోలీస్​ అధికారి సహా పలువురికి బుల్లెట్లు తగిలాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందినట్లు సమాచారం.

ఈ కాల్పుల గురించి ఇంకా ఎక్కువ సమాచారం లేదు, కానీ DC పోలీస్ డిపార్ట్‌మెంట్.. 14వ మరియు U స్ట్రీట్ ప్రాంతానికి ప్రతిస్పందిస్తోందని ట్వీట్ చేసింది. ఎమర్జెన్సీ సిబ్బందితో పాటు ఏటీఎఫ్ కూడా రంగంలోకి దిగింది. పోలీసులు త్వరలోనే మీడియాకు సమాచారం అందించనున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Gun fire, USA

తదుపరి వార్తలు