హోమ్ /వార్తలు /క్రైమ్ /

Seventh Fail: ఏడో తరగతి ఫెయిల్.. బ్యాంకు ఖాతాలో రూ.60 లక్షలు.. మనోడి స్టోరీ తెలిస్తే రెండు చేతులు జేబులో పెట్టుకుని..

Seventh Fail: ఏడో తరగతి ఫెయిల్.. బ్యాంకు ఖాతాలో రూ.60 లక్షలు.. మనోడి స్టోరీ తెలిస్తే రెండు చేతులు జేబులో పెట్టుకుని..

నిందితుడు సిద్ధార్థ

నిందితుడు సిద్ధార్థ

బెంగళూరుకు చెందిన ఆ 33 ఏళ్ల యువకుడి పేరు సిద్ధార్థ. చదివింది ఏడో తరగతి. అది కూడా ఫెయిల్. కానీ.. సిద్ధార్థ మాములోడు కాదు. సెవెన్త్ ఫెయిలయిన ఈ కంత్రీ మొత్తం ఏడు భాషలు మాట్లాడగలడు. స్పానిష్, ఇంగ్లీష్ ఇతను మాట్లాడే విధానం చూస్తే సిద్ధార్థ కచ్చితంగా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తే అని నమ్మకుండా ఉండలేరు.

ఇంకా చదవండి ...

బెంగళూరు: మానవుడు సాధించిన అద్భుత ప్రగతికి నిలువెత్తు నిదర్శనం టెక్నాలజీ. ఈ సాంకేతికతను సక్రమంగా వినియోగించుకునే వారు కొందరైతే.. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో ఈజీ మనీ కోసం వెంపర్లాడేవారు మరికొందరు ఈ సమాజంలో ఉన్నారు. బెంగళూరుకు చెందిన ఓ 33 ఏళ్ల వ్యక్తి టెక్నాలజీని అడ్డం పెట్టుకుని చదువుకున్న యువతులను చాలామందిని మోసం చేశాడు. ఈ ఘరానా మోసగాడి బాగోతాన్ని సైబర్ క్రైం పోలీసులు బయటపెట్టారు. ఈ కేటుగాడి ఆట కట్టించారు. బెంగళూరుకు చెందిన ఆ 33 ఏళ్ల యువకుడి పేరు సిద్ధార్థ. చదివింది ఏడో తరగతి. అది కూడా ఫెయిల్. కానీ.. సిద్ధార్థ మాములోడు కాదు. సెవెన్త్ ఫెయిలయిన ఈ కంత్రీ మొత్తం ఏడు భాషలు మాట్లాడగలడు. స్పానిష్, ఇంగ్లీష్ ఇతను మాట్లాడే విధానం చూస్తే సిద్ధార్థ కచ్చితంగా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తే అని నమ్మకుండా ఉండలేరు. అంతలా.. తన ఇంగ్లీష్‌తో ఎదుటి వారిని బుట్టలో పడేయగలడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో తన ప్రొఫైల్ అప్‌లోడ్ చేశాడు. అంతేకాదు.. మైసూరు రాజ వంశానికి చెందిన వ్యక్తిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. అతని ప్రొఫైల్ చూసి చాలామంది చదువుకున్న యువతులు ఆకర్షితులయ్యారు. కాల్స్‌లో అతని ఇంగ్లీష్ విన్న అమ్మాయిలు కచ్చితంగా సిద్ధార్థ అమెరికాలో స్థిరపడిన మైసూరు రాజ వంశీయుడే అని నమ్మేవారు. వారిని నమ్మించేందుకు మైసూరు రాజ వంశీయులతో కలిసి ఉన్నట్టుగా కొన్ని ఫొటోలను కూడా పంపేవాడు.

మనోడి ఇంగ్లీష్‌కు ఫిదా అయిపోయిన చాలామంది చదువుకున్న యువతులు తనను పెళ్లి చేసుకుంటే హ్యాపీ లైఫ్ కొనసాగించవచ్చని భ్రమ పడి అతనితో పెళ్లికి సిద్ధపడ్డారు. కెమెరాలో వీడియో కాల్ మాట్లాడకుండా సిద్ధార్థ జాగ్రత్తపడేవాడు. ఇలా అతని మాయలో పడిన చాలామంది అమాయక యువతులు నుంచి ఏవేవో సాకులు చెప్పి డబ్బును తన ఖాతాలోకి పంపించుకునేలా సిద్ధార్థ చేసేవాడు. అలా దాదాపు వేరువేరు యువతుల నుంచి రూ.60 లక్షలు తన ఖాతాలో పడేలా చేసుకున్నాడు. డబ్బు ముట్టిన కొన్ని రోజులకు వాళ్లతో సంబంధాలను తెంచుకునేవాడు.

ఇది కూడా చదవండి: Wife and Husband: భార్యాభర్తల మధ్య ఇదెక్కడి గొడవ.. భర్త బయటకు వెళ్లి ఇంటికొచ్చేసరికి...

బాగా చదువుకున్న కుటుంబాలకు చెందిన యువతులే ఈ మాయగాడి వలలో ఎక్కువగా చిక్కుకోవడం గమనార్హం. కొంతమందిని ఉద్యోగాల పేరుతో కూడా సిద్ధార్థ మోసం చేసినట్లు విచారణలో తేలింది. ధైర్యం చేసి ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేటుగాడి బాగోతం వెలుగులోకి వచ్చింది. సిద్ధార్థ బైలకుప్పె దగ్గర్లోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తేల్చారు. బైలకుప్పెను ‘మినీ టిబెట్’గా కూడా పిలుస్తుంటారు. చాలామంది విదేశస్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వస్తుంటారు. అలా వచ్చిన విదేశస్తుల నుంచే సిద్ధార్థ ఇంగ్లీష్‌తో పాటు పలు భాషలు నేర్చుకున్నట్టు తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.

First published:

Tags: Bangalore, Cheating, CYBER CRIME

ఉత్తమ కథలు