‘కన్య భోజనం’లో విషాదం.. కాలిపోయిన ఏడేళ్ల చిన్నారి

చనిపోయిన బాలిక కుటుంబానికి రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన బాలికలు ప్రస్తుతం ఉన్నావ్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

news18-telugu
Updated: October 7, 2019, 7:58 PM IST
‘కన్య భోజనం’లో విషాదం.. కాలిపోయిన ఏడేళ్ల చిన్నారి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలిక సజీవదహనమైంది. ఉన్నావ్ జిల్లాలోని నిఫ్‌స్పంసారీ గ్రామంలో ఓ ఆచారం ఉంది. దేవీ శరన్నావరాత్రి ఉత్సవాల సందర్భంగా పెళ్లికాని బాలికలను అమ్మవారికి ప్రతిరూపంగా కొలుస్తారు. వారికి వివిధ రకాల పిండివంటలు, బహుమతులు అందిస్తారు. ఈ సారి కూడా గ్రామంలోని బాలికలకు అలాంటి కార్యక్రమం నిర్వహించారు. చిన్న పిల్లలను తీసుకుని వచ్చి ఓ చోట కూర్చోబెట్టారు. ఆ ఇంటి ఎదుట.. కొందరు అక్రమంగా పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారు. ఆ పక్కనే హోమం నిర్వహిస్తున్నారు. మంటలు పెద్దగా రావడంతో నిప్పురవ్వలు ఎగసి పక్కనే ఉన్న ఇంటి మీద పడ్డాయి. అక్కడ ఉన్న పెట్రోల్ డబ్బాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో క్షణాల్లో ఇల్లు తగలబడిపోవడం మొదలైంది. ఇంటికి నిప్పంటుకోవడాన్ని గమనించిన స్థానికులు అందులో ఉన్న ముగ్గురు పిల్లలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇద్దరు బాలికలను తీసుకొచ్చారు. కానీ, ఏడేళ్ల పూజను మాత్రం తీసుకురాలేకపోయారు. దీంతో లోపల బాలిక సజీవదహనమైంది. తనను కాపాడాలంటూ బాలిక లోపలి నుంచి పెద్ద పెద్దగా అరుస్తున్నా కాపాడలేకపోయామని స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. చనిపోయిన బాలిక కుటుంబానికి రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన బాలికలు ప్రస్తుతం ఉన్నావ్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.First published: October 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>