వేరే కులం మహిళతో వివాహేతర సంబంధం.. వద్దని చెప్పినా వినకపోవడంతో ఎంతటి దారుణానికి తెగించారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి ఇతర కులానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది కాస్తా అతడి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. బంధువులు నచ్చజెప్పినా అతడు వినలేదు. దీంతో పదేళ్లుగా వేరే మహిళతో కలిసి వేరే ఊళ్లో ఉంటున్నాడు. దీంతో..

 • Share this:
  వివాహేతర సంబంధాలు ఎన్నో దారుణ ఘటనలకు కారణమవుతున్నాయి. ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి. ఎంతో మంది దారుణ హత్యలకు గురవుతున్నారు. భర్తను భార్య చంపేయడమో, భార్యే భర్తను హతమార్చడమో వంటివి జరుగుతూనే ఉన్నాయి. మరికొన్ని చోట్ల భార్యాభర్తలిద్దరూ కలిసి తమ మధ్య వచ్చిన మూడో వ్యక్తిని మట్టుబెడుతున్నారు. ఇదే సమయంలో అక్రమ సంబంధం విషయం నచ్చక కుటుంబ సభ్యులే చంపేస్తున్న సంఘటనలు కూడా కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ వ్యక్తి ఇతర కులానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది కాస్తా అతడి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. బంధువులు నచ్చజెప్పినా అతడు వినలేదు. దీంతో పదేళ్లుగా వేరే మహిళతో కలిసి వేరే ఊళ్లో ఉంటున్నాడు. అతడి ప్రవర్తన పట్ల విసుగు చెందిన దగ్గరి బంధువులే అతడిని కడతేర్చారు. ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పారేశారు. ఒడిసా రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఒడిసా రాష్ట్రంలోని సుందరగర్హ్ జిల్లా చితభంగా గ్రామానికి చెందిన దుర్గా మాఝీ అనే వ్యక్తి పదేళ్లుగా అదే ఊరిలో ఓ మహిళతో కలిసి ఉంటున్నాడు. తన సొంత కుటుంబ సభ్యులతో విబేధించి, వేరే మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. అయితే ఇతర కులానికి చెందిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అతడి బంధువులు కోపం పెంచుకున్నారు. ఇదే విషయమై అతడితో గొడవ పడ్డారు. ఫిబ్రవరి 28వ తారీఖున దుర్గా మాఝీకి దగ్గర బంధువైన అర్జున్ మాఝీతో కలిసి మద్యం తాగుతున్నాడు. ఇదే సమయంలో అతడి అక్రమ బంధం గురించి చర్చ జరిగింది. ఇది కాస్తా వారిద్దరి మధ్య గొడవకు దారి తీసింది.
  ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..

  దీంతో ఆగ్రహానికి గురయిన అర్జున్, దుర్గాను చంపేశాడు. అతడి నాలుకను కోశాడు. తల నరికాడు. శరీరాన్ని ఏడు భాగాలుగా చేశాడు. అతడికి మరో ఆరుగురు బంధువులు సాయం చేశారు. అంతా కలిసి అతడి శరీర భాగాలను నదిలో పారేశారు. మార్చి మూడో తారీఖున అతడి శరీర భాగాల్లో కొన్ని నదిలోంచి బయటపడటంతో ఈ విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తానికి మార్చి 14వ తారీఖు శనివారం ఈ ఘోరానికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.
  ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!
  Published by:Hasaan Kandula
  First published: