• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • SEVEN PERSONS KILLED IN ROAD ACCIDENTS IN GAYA DISTRICT BIHAR BN

ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు ఆటోలను ఢీకొనడంతో ఏడుగురు..

ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు ఆటోలను ఢీకొనడంతో ఏడుగురు..

ఖమ్మం జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వాహనం ప్రమాదానికి గురైంది.

రెండు ఆటోల్లో కొంతమంది రెగానియా ప్రాంతంలో ఓ వేడుకకను హాజరయ్యారు. గయా నుంచి ఔరంగాబాద్ వైపు తిరిగి వస్తుండగా జీటీ రహదారిపై ఓ ట్రక్కు వేగంగా వచ్చి రెండు ఆటోలను ఢీకొట్టింది

  • Share this:
    ఓ ట్రక్కు రెండు ఆటోలను ఢీకొనడంతో ఏడుగురు చనిపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని గయా జిల్లా బిష్ణుగంజ్ గ్రామం సమీపంలో రెండు ఆటోల్లో కొంతమంది రెగానియా ప్రాంతంలో ఓ వేడుకకను హాజరయ్యారు. గయా నుంచి ఔరంగాబాద్ వైపు తిరిగి వస్తుండగా జీటీ రహదారిపై ఓ ట్రక్కు వేగంగా వచ్చి రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. గాయపడిన వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు