news18-telugu
Updated: August 19, 2019, 4:16 PM IST
బెంగళూరులో కారు ప్రమాదం
అసలే ఆదివారం.. ఫుల్లుగా మందేశాడో కారు డ్రైవర్.. తూలుతూనే కారెక్కి వేగంగా ముందుకు పోనిచ్చాడు. స్టీరింగ్‌ను అష్టవంకలు తిప్పుతూ వాహనదారులకు గుబులు పుట్టించాడు.. వీడేదో చేసేట్టున్నాడే! అనుకునేలోపే రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై చిరుతిళ్లు తింటున్న వ్యక్తులపైకి కారును పోనిచ్చాడు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే అవుట్లో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. రాజేంద్ర(30) అనే వ్యక్తి ఫుల్లుగా మందేసి తన కారును జనాలపైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలవ్వగా, ఇద్దరు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి సంబంధించిన చిత్రాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యాయి.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి, సెక్షన్ 185 (డ్రింక్ అండ్ డ్రైవ్), సెక్షన్ 279(ర్యాష్ డ్రైవింగ్) కింద బుక్ చేశారు. అదృష్టవశాత్తు ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదని, తాగి కారు నడిపినందుకు నిందితుడికి తగిన బుద్ధి చెబుతామని వెల్లడించారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
August 19, 2019, 4:16 PM IST