పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో దారుణం జరిగింది. తెలిసిన వ్యక్తే వివాహితను బైక్ ఎక్కించుకొని తీసుకెళ్లి మరో ఆరుగురితో కలిసి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అమానుష ఘటన డిసెంబరు 12న చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. భర్తతో పొసగక పట్టణానికి చెందిన యువతి(23) తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే.. ఆ రోజు రాత్రి మందులు కొనుక్కొని ఇంటికి వెళ్తుండగా వెంకటాపురానికి చెందిన యాకోబ్ తారసపడ్డాడు. ఇంటి వద్ద దింపుతానని చెప్పడంతో తెలిసినవాడే కదా అని బైక్ ఎక్కింది. దాంతో ఆమెను ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లాడు. తన స్నేహితులకు ఫోన్ చేసి రప్పించాడు. వాళ్లంతా కలిసి ఆమెపై పలుమార్లు దారుణానికి ఒడిగట్టారు.
అయితే.. తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయింది. ఇదే అలుసుగా తీసుకున్న నీచుడు యాకోబ్.. ఆమెను వేధించడం ప్రారంభించాడు. తాను చెప్పిన చోటుకు రావాలని, లేకపోతే అందరికీ చెబుతానని బెదిరించసాగాడు. మంగళవారం రాత్రి కూడా ఆమెను ఇదే విధంగా వేధించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆ యువతి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, AP News, Crime, Disha Act, Eluru, West Godavari