Home /News /crime /

SEVEN KILLED MANY MISSING AS MASSIVE LANDSLIDE IN MANIPUR PVN

Manipur Landslide :ఘోరం..కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి,జవాన్లు కూడా..శిథిలాల కిందే 50 మంది!

కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

Massive landslide in manipur : ఈశాన్య భారతంలో కొద్దిరోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించడం.పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా వర్షాల కారణంగా మణిపుర్​లోని నోని జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.  రైల్వే పనులు జరుగుతున్న తుపుల్ యార్డ్ వద్ద బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడటంలో ఏడుగురు మృతి చెందగా, మ‌రో 13 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు.

ఇంకా చదవండి ...
Massive landslide in manipur : ఈశాన్య భారతంలో కొద్దిరోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించడం.పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా వర్షాల కారణంగా మణిపుర్(Manipur)​లోని నోని జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.  రైల్వే పనులు జరుగుతున్న తుపుల్ యార్డ్ వద్ద బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో(Massive Landslide) ఏడుగురు మృతి చెందగా, మ‌రో 13 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. క్ష‌త‌గాత్రుల‌ను ట్రీట్మెంట్ కోసం స‌మీప హాస్పిటల్స్ కి త‌ర‌లిస్తున్నారు. కాగా,మృతుల్లో జ‌వాన్లు ఉన్న‌ట్లు స‌మాచారం. రైల్వే లైన్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ సైట్ వ‌ద్ద కాప‌లాగా జ‌వాన్లు ఉన్నారు.

అర్ధరాత్రి సమయంలో కొండచరియలు విరిగిపడి జిరిబామ్ నుండి ఇంఫాల్ వరకు నిర్మాణంలో ఉన్న రైల్వే లైన్ రక్షణ కోసం టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో మోహరించిన 107 టెరిటోరియల్ ఆర్మీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ కంపెనీపై పడినట్లు అధికారులు తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైల్వే ట్రాక్ పనుల కోసం అక్కడ ఉన్న కార్మికులతో పాటు పలువురు స్ధానికులు కూడా ఈ ఘటనలో దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. నిర్మాణంలో పాల్గొంటున్న కూలీల శిబిరాలు ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. కొండ‌చ‌రియ‌ల కింద ఇంకా 50 మందికి పైగా స్థానికులు, సైనికులు చిక్కుకున్నారని సమాచారం. శిథిలాల‌ను తొల‌గించి వారిని కాపాడేందుకు స‌హాయ‌క చ‌ర్య‌లు కొనసాగుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా వీరిని రక్షించడం ఎన్డీఆర్ఎఫ్ కు కూడా కష్టసాధ్యంగా మారుతోంది.

Shoking : పెళ్లైన 5 నెలలకే..కట్నం తేలేదని భార్యను చంపి శవాన్ని అదృశ్యం చేసిన భర్త,అత్తమామలు

అయితే కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో అక్క‌డున్న ఐజెయ్ న‌ది ప్ర‌వాహం ఆగిపోయింది. దీంతో నోని జిల్లా ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. న‌ది వ‌ద్ద‌కు పిల్ల‌ల‌ను వెళ్ల‌నివ్వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. వరద నీరు రిజర్వాయర్​లా మారిందని. నీటి ప్రభావానికి శిథిలాలు ఒక్కసారిగా పక్కకు జరిగిపోతే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోతాయని,ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై మ‌ణిపూర్ ముఖ్య‌మంత్రి ఎన్ బీరెన్ సింగ్ అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. ఘ‌ట‌నాస్థ‌లికి అంబులెన్స్‌ల‌తో పాటు వైద్యుల‌ను పంపాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. సీఎం బీరెన్ సింగ్​.. రైల్వే మంత్రి అశ్వినీ వైశ్ణవ్​తో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. సహాయక చర్యల కోసం ఎన్​డీఆర్ఎఫ్ బృందం ఘటనాస్థలికి చేరుకుందని చెప్పిన సీఎం మరో రెండు బృందాలు సైతం వస్తున్నాయని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Landslide, Manipur

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు