కృష్ణా జిల్లాలో ట్రాక్టర్, లారీ ఢీ... 9కి పెరిగిన మరణాలు...

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

news18-telugu
Updated: June 17, 2020, 5:08 PM IST
కృష్ణా జిల్లాలో ట్రాక్టర్, లారీ ఢీ... 9కి పెరిగిన మరణాలు...
జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం
  • Share this:
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 9కి పెరిగింది. మరో 15 మందికిపైగా గాయపడినట్టు తెలిసింది. మృతులు అందరూ ఖమ్మం జిల్లా మధిర వాసులు. ఖమ్మం జిల్లా మధిర మండలం గోపవరం నుంచి 25 మందితో ట్రాక్టర్ల లో దైవదర్శ నానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన లో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. రోడ్డు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు స్పందించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉన్న ఆయన వెంటనే జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కి ఫోన్ చేసి తక్షణ సహాయక చర్యలు అందే విధంగా పోలీసువారికి తెలియజేయాలని కోరారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స అందే విధంగా డాక్టర్లకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. తాను అసెంబ్లీ సమావేశంలో ఉన్నానని, అయినప్పటికీ సహాయక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలియజేశారు.

మృతిచెందిన వారి వివరాలు...

1 వేమిరెడ్డి పద్మావతి (45),
2 పూడూరు ఉపేందర్ రెడ్డి(15),
3. వేమిరెడ్డి ఉదయ్(6)
4. గూడూరు సూర్యనారాయణ రెడ్డి(46),
5. లక్కిరెడ్డి అప్పమ్మ,6. రాజి
7.అక్కమ్మ(45),
8.గూడూరు రమణమ్మ(45),
9. వేమిరెడ్డి భారతమ్మ(70)

మరోవైపు రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా మధిర వాసులు దుర్మరణం చెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 17, 2020, 2:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading