మంటల్లో కాలిపోతూనే పోలీసులకు ఫోన్.. ఉన్నావ్ కేసులో సంచలన విషయాలు

మంటల్లో కాలిపోతూనే దాదాపు కిలోమీటర్ దూరం పరుగెత్తింది. కాపాడండి..కాపాడండి.. అంటూ ఆర్తనాదాలు చేసింది. శక్తిని, ధైర్యాన్ని కూడగట్టుకొని తానే స్వయంగా అంబులెన్స్‌ కోసం 112కి డయల్ చేసింది.

news18-telugu
Updated: December 5, 2019, 6:33 PM IST
మంటల్లో కాలిపోతూనే పోలీసులకు ఫోన్.. ఉన్నావ్ కేసులో సంచలన విషయాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌ దిశా హత్యాచార ఘటనపై దేశమంతటా దుమారం రేగుతున్న వేళ.. యూపీలో అలాంటి ఘోరమే జరిగింది. అత్యాచార బాధితురాలిని ఐదుగురు వ్యక్తులు తగులబెట్టారు. తమపై రేప్ కేసు పెట్టిందనే కోపంతో పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఉన్నావ్‌లో జరిగిన ఈ దారుణ కాండపై పెను దుమారం రేగుతోంది. 90శాతం గాయాలతో లక్నోలోని ఓ ఆస్పత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. ఐతే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పెట్రోల్ పోసి నిప్పంటించినా తనను తాను కాపాడుకునేందుకు తీవ్రంగా పోరాడింది బాధితురాలు. మంటల్లో కాలిపోతూనే దాదాపు కిలోమీటర్ దూరం పరుగెత్తింది. కాపాడండి..కాపాడండి.. అంటూ ఆర్తనాదాలు చేసింది. శక్తిని, ధైర్యాన్ని కూడగట్టుకొని తానే స్వయంగా అంబులెన్స్‌ కోసం 112కి డయల్ చేసింది. ఆమె ఫోన్ చేయడంతోనే పోలీసులు, అంబులెన్స్ అక్కడికి వచ్చిందని స్థానికులు తెలిపారు. అనంతరం బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాలిన గాయాలతోనే ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా, మార్చిలో ఇద్దరు వ్యక్తులపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. అదంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదవగా.. ప్రస్తుతం రాయ్‌బరేలీ కోర్టులో విచారణ జరుగుతోంది. నిందితుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మరో నిందితుడిని మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఇదే క్రమంలో గురువారం ఆమె కోర్టు విచారణకు బయలుదేరగా.. గ్రామ శివారుల్లో దుండగులు ఆమెను అడ్డగించి పెట్రోల్ పోసి నిప్పంటించారు.
First published: December 5, 2019, 6:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading