#జర భద్రం: ఫోన్ రిపేర్‌కు ఇస్తే... పేటీఎంలో రూ.91,000 కొట్టేశారు...

పేటీఎం ఇ-మెయిల్స్ చూసి షాకైన కరీం వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తాను రిపేర్ కోసం ఫోన్‌ని సర్వీస్ సెంటర్‌లో ఇచ్చానని, తన పేటీఎం అకౌంట్‌లోకి ఎవరో లాగిన్ అయి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారని కంప్లైంట్ ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు తెలిశాయి.

news18-telugu
Updated: November 2, 2018, 10:33 AM IST
#జర భద్రం: ఫోన్ రిపేర్‌కు ఇస్తే... పేటీఎంలో రూ.91,000 కొట్టేశారు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అందుకే అంటారు... ఫోన్‌లోని మనీ యాప్స్‌కి పాస్‌వర్డ్ తప్పనిసరిగా పెట్టుకోవాలని. ఓ వ్యక్తి పేటీఎం యాప్‌కు పాస్‌వర్డ్ పెట్టుకోకుండా తప్పుచేశాడు. ఫలితంగా రూ.91,000 పోగొట్టుకున్నాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఓ హెచ్చరిక. ఢిల్లీలోని కల్కాజీకి చెందిన 28 ఏళ్ల యూసుఫ్ కరీం మొబైల్ ఫోన్ పాడైంది. దీంతో అతను రిపేర్ కోసం సర్వీస్ సెంటర్‌లో ఇచ్చాడు. అక్కడి సిబ్బంది ఫోన్ రిపేర్ చేసి తిరిగిచ్చారు. ఇంటికెళ్లాక కరీం తన ఇ-మెయిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్. అందులో పేటీఎం నుంచి వరుసగా మెయిల్స్ ఉన్నాయి. అతడి పేటీఎం అకౌంట్ నుంచి రూ.91,000 వేర్వేరు అకౌంట్లల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసినట్టు కనిపించింది.

#జర భద్రం: ఫోన్ రిపేర్‌కు ఇస్తే... పేటీఎంలో రూ.91,000 కొట్టేశారు..., Service Centre Staff Withdraws Over Rs 90,000 From Delhi Man’s Paytm Account
ప్రతీకాత్మక చిత్రం


పేటీఎం ఇ-మెయిల్స్ చూసి షాకైన కరీం వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తాను రిపేర్ కోసం ఫోన్‌ని సర్వీస్ సెంటర్‌లో ఇచ్చానని, తన పేటీఎం అకౌంట్‌లోకి ఎవరో లాగిన్ అయి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారని కంప్లైంట్ ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు తెలిశాయి. కరీం పేటీఎంలో డబ్బులు కొట్టేయడమే కాదు... అతని అతని రిజిస్టర్డ్ ఇ-మెయిల్ అడ్రస్ కూడా మార్చేసి రూ.19,999 ట్రాన్స్‌ఫర్ చేశారని తేలింది. అంతకుముందు ఏడు ట్రాన్సాక్షన్స్‌లో రూ.80,498 విత్‌డ్రా చేసుకున్నారు.

సర్వీస్‌ సెంటర్‌లో ఉన్న ఇంజనీర్లే తన పేటీఎం నుంచి డబ్బులు కొట్టేశారన్నది బాధితుడి ఆరోపణ. అంతేకాదు... తాను ఎన్ని రిక్వెస్ట్‌లు పెట్టినా పేటీఎం తన అకౌంట్ బ్లాక్ చేయలేదంటున్నాడు. ఈ వ్యవహారంపై పేటీఎం స్పందించాల్సి ఉంది. సో... చూశారుగా. ఇకపై మీ ఫోన్ ఎవరికైనా ఇచ్చే ముందు వ్యాలెట్ యాప్స్ అన్‍ఇన్‌స్టాల్ చేయండి. లేదా పాస్‌వర్డ్ సెట్ చేసి పెట్టుకోండి. లేకపోతే... ఇలాగే మోసపోవచ్చు.

ఇవి కూడా చదవండి:

పేటీఎంలో మీ డబ్బు ఎంత సేఫ్?

గూగుల్‌లోనే ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, స్నాప్‌డీల్ 'షాపింగ్ ట్యాబ్స్'గూగుల్‌లో మీ డేటాను ఎలా డిలిట్ చేయాలో తెలుసా?

వాట్సప్ డేటా బ్యాకప్: నవంబర్ 12 డెడ్‌లైన్!

లీకైన గూగుల్ ప్లస్ డేటా... ఇప్పుడు మీరేం చేయాలి?
First published: November 2, 2018, 10:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading