• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • SERIES OF LOVE PROPOSALS TO A GIRL FROM THREE FRIENDS LEADS TO FIGHTS BETWEEN THEM IN HYDERABAD FULL DETAILS HERE HSN

Hyderabad: నా ప్రేయసికి ఇలాంటి మెసేజ్ లు పంపిస్తారా?.. అంటూ ఇద్దరు ఫ్రెండ్స్ ను నిలదీసిన ఇంటర్ కుర్రాడు.. చివరకు..

Hyderabad: నా ప్రేయసికి ఇలాంటి మెసేజ్ లు పంపిస్తారా?.. అంటూ ఇద్దరు ఫ్రెండ్స్ ను నిలదీసిన ఇంటర్ కుర్రాడు.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

ఓ 19 ఏళ్ల ఇంటర్ కుర్రాడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ విషయం అతడి ఇద్దరు స్నేహితులకు కూడా తెలుసు. కానీ, ఆ యువతికి తన ఇద్దరు స్నేహితులు ఒకేలాంటి మెసేజ్ ను వాట్సప్ లో పంపించారని ఆ కుర్రాడికి తెలిసింది. వాళ్లను నిలదీస్తే..

  • Share this:
    ‘అరేయ్ మామా.. నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నా. ఆ అమ్మాయి ప్రేమను పొందడంలో నాకు మీరు సాయం చేయాలి’ అని ఇద్దరు ప్రాణ స్నేహితులను ఓ కుర్రాడు కోరాడు. ఆ ఇద్దరు స్నేహితులు కూడా సరేనన్నారు. ఏడాది కాలంగా ఆమె ప్రేమను పొందేందుకు ఆ కుర్రాడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చివరకు అతడి ప్రపోజల్ ను ఆమె తిరస్కరించింది. ఈ విషయం ఆ కుర్రాడి స్నేహితులిద్దరికీ తెలిసింది. అతడికి ధైర్యం చెప్పి బాధను పొగొట్టాల్సిన వాళ్లు కాస్తా ఊహించని నిర్వాకానికి పాల్పడ్డారు. ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒకరు ముందుగా ఆ అమ్మాయి ఫోన్ కు ఓ మెసేజ్ ను పంపాడు. మరో యువకుడు కూడా అదే రీతిలో మెసేజ్ ను పంపాడు. ఈ విషయం కాస్తా వాళ్లిద్దరి స్నేహితుడికి తెలిసింది. చివరకు రచ్చ రచ్చ అయింది. పోలీసుల వద్దకు మేటర్ వెళ్లింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    హైదరాబాద్ లోని రహ్మత్ నగర్ లోని బంగారు మైసమ్మ ఆలయం సమీపంలో సాయి చైతన్య అనే 19 ఏళ్ల కుర్రాడు నివసించేవాడు. అతడు ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడికి 17 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీళ్లు ముగ్గురు చిన్నప్పటి నుంచి ప్రాణమిత్రులు. సాయి చైతన్య తన బంధువుల కుటుంబానికే చెందిన ఓ 17 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఆమె ప్రేమను పొందేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే ఆమె గురించి తన ప్రాణ మిత్రులకు చెప్పి ఆమె ప్రేమను గెలుచుకునేందుకు మీసాయం కావాలంటూ కోరాడు. ఆ ముగ్గురు కలిసి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ఏడాది నుంచి చేస్తున్న ఈ ప్రయత్నాలు చివరకు బెడిసికొట్టాయి. సాయి చైతన్య ప్రేమ ప్రపోజల్ ను ఆ యువతి తిరస్కరించింది.

    ఈ విషయాన్ని తన స్నేహితులకు ఇద్దరికీ చెప్పి వాపోయాడు. అయితే స్నేహితుడిని ఓదార్చాల్సిన ఆ ఇద్దరు కుర్రాళ్లు దాన్ని ఓ అవకాశంగా మార్చుకున్నారు. వాళ్లిద్దరిలో ఓ యువకుడు మొదటగా ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ఫ్రెండ్ నిన్ను ప్రేమిస్తున్నాడని, నువ్వు కూడా అతడిని ఇష్ట పడుతున్నావేమోనని ఇన్నాళ్లుగా నేను చెప్పకుండా ఉండిపోయా. వన్ సైడ్ లవర్ గా ఎన్నో నిద్రలేని రాత్రులను అనుభవించా’ అంటూ ఆ యువతి వాట్సప్ కు ఓ మెసేజ్ ను పంపాడు. కానీ ఆ యువతి మాత్రం ఇతడి ప్రేమను కూడా రిజెక్ట్ చేసింది. తనకు ఇష్టం లేదంటూ తేల్చిచెప్పింది. దీంతో మరో కుర్రాడు కూడా ఇదే రీతిలో ఆ యువతికి మెసేజ్ ను పంపాడు. అతడి ప్రేమ ప్రపోజల్ ను కూడా ఆ యువతి రిజెక్ట్ చేసింది.

    వరుసగా ముగ్గురు స్నేహితులు తనకు లవ్వంటూ ప్రేమ సందేశాలు పంపిస్తుండటంతో ‘మీకేమైనా పిచ్చా. ఒకళ్ల తర్వాత మరొకళ్లు ప్రేమిస్తున్నానంటూ మెసేజ్ పంపుతున్నారేంటి? నన్ను టెస్ట్ చేద్దామనుకుంటున్నారా?’ అంటూ సాయి చైతన్యకు ఫోన్ చేసి తిట్టింది. దీంతో అసలు విషయం ఏంటో సాయి చైతన్యకు తెలిసింది. తాను ప్రేమిస్తున్న అమ్మాయికి ఇలాంటి మెసేజ్ లు పంపడం ఏంటంటూ వాళ్లిద్దరినీ నిలదీశాడు. ఫోన్లోనే మాటా మాటా పెరిగింది. ఎవరేంటో చూసుకుందామంటూ నిమ్స్ వే కు చెందిన నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ సాయి చైతన్య తన ఇద్దరు మిత్రులతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న బ్లేడ్ తో ఓ స్నేహితుడి మెడపై కోశాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. మరో స్నేహితుడు అతడిని అమీర్ పేటలోని ఓ ఆస్పత్రిలో చేర్చాడు. ఆస్పత్రి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బాధితుడి నుంచి ఫిర్యాదును తీసుకున్నారు. కేసు నమోదు చేసి సాయి చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. అతడిని రిమాండ్ కు తరలించామనీ, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు