SERIES OF DEATHS IN A SINGLE FAMILY FOUR MEMBERS DIED WITH IN FOUR MONTHS IN NIZAMABAD DISTRICT FULL DETAILS HERE HSN
Nizamabad: ఒకరి తర్వాత మరొకరు ఒకే ఇంట్లో నలుగురు మృతి.. సాయంత్రం భార్య మరణం.. తెల్లారగానే భర్త కూడా.. అసలేం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
నాలుగు నెలల వ్యవధిలోనే నలుగురి మరణాలు. కేవలం పదిరోజుల గ్యాప్ లోనే ఆ ఇంట్లో ముగ్గురు మరణించారు. నాలుగు నెలల క్రితం ఓ వ్యక్తి, పది రోజుల క్రితం మరో వ్యక్తి మరణించారు. 24 గంటల వ్యవధిలోనే మరో ఇద్దరు..
ఒకరు తర్వాత మరొకరు. నాలుగు నెలల వ్యవధిలోనే నలుగురి మరణాలు. కేవలం పదిరోజుల గ్యాప్ లోనే ఆ ఇంట్లో ముగ్గురు మరణించారు. మృత్యువు ఆ ఇంటిపై పగబట్టిందంటూ ఆ ఊరి వాళ్లు, బంధువులు అనుకునేలా ఈ వరుస ఘటనలు ఊతమిచ్చాయి. నాలుగు నెలల క్రితం ఓ వ్యక్తి, పది రోజుల క్రితం మరో వ్యక్తి మరణించారు. గురువారం సాయంత్రం ఒకరు చనిపోతే, శుక్రవారం ఉదయమే మరొకరు ప్రాణాలు విడిచారు. అసలేమయిందో? ఏం జరిగిందోనన్న భయం ఆ ఊళ్లో అందరిలోనూ కలుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన 60 ఏళ్ల కర్రవ్వ, 70 ఏళ్ల లింబాద్రి కుటుంబం వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు. ముగ్గురికీ పెళ్లిళ్లు అయ్యాయి. వేరువేరుగానే పక్క పక్క ఇళ్లల్లోనే కాపురం ఉంటున్నారు. అందరికీ పొలాలు ఉండటంతో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతుల రెండో కుమారుడు 35 ఏళ్లు సుదర్శన్ నాలుగు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించాడు. అప్పటి నుంచి మృత్యువు వీరి ఇంటిపై పగబట్టింది. ఒకరి తర్వాత మరొకరు మరణించడం మొదలయింది. పెద్ద కుమారుడు 41 ఏళ్ల రమేష్ కు మూత్ర సంబంధ వ్యాధి ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఏప్రిల్ 6వ తారీఖున మరణించాడు. సుదర్శన్ కు నలుగురు కుమార్తెలు కాగా, రమేష్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
అందరూ చదువుకుంటున్నారు. అయితే ఇద్దరు కొడుకుల మరణంతో కర్రవ్వ, లింబాద్రి ఆవేదనకు గురయినట్టు తెలుస్తోంది. కోడల్లు, మనవళ్లు, మనవరాళ్ల భవిష్యత్ గురించి బెంగ పెట్టుకున్నారు. ఆ ఆవేదనతోనే గురువారం సాయత్రం కర్రవ్వ మరణించింది. ఆమె మరణించి కనీసం 24 గంటలు కూడా గడవక ముందే శుక్రవారం ఉదయం లింబాద్రి కూడా మరణించాడు. అనారోగ్య సమస్యలతో పాటు మానసికంగా వేధనకు గురవడం వల్లే వారు మరణించారని వైద్యులు చెబుతున్నారు. ఒకే ఇంట్లో నాలుగు నెలల వ్యవధిలోనే ఇలా నలుగురు మరణించడం పట్ల అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.