బావిలోకి తోసి, గాయాలైన బాలికలపై అత్యాచారం... యాదాద్రి సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి అరెస్ట్...

శ్రీనివాస్‌రెడ్డిపై నాలుగు హత్య కేసులు... ఒంటరిగా రోడ్డుపైన ఎదురుచూసే బాలికలే టార్గెట్... లిఫ్ట్ ఇచ్చి, ఆపై బావి దగ్గరకు తీసుకెళ్లి...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 30, 2019, 9:41 PM IST
బావిలోకి తోసి, గాయాలైన బాలికలపై అత్యాచారం... యాదాద్రి సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి అరెస్ట్...
హాజీపూర్ హత్యకేసుల్లో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి
  • Share this:
తెలుగురాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేసిన హాజీపూర్ వరుస హత్యల మిస్టరీ వీడింది. హత్యాచారానికి గురైన శ్రావణి, మనీషా, కల్పనలను చంపింది సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డి అని తేల్చారు హైదరాబాద్ పోలీసులు. రాచకొండ పోలీస్ కమీషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన విషయాలను వివరించారు హైదరాబాద్ సీపీ మహేశ్ భగవత్. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... 2015లో కల్పన అనే బాలిక కనిపించకుండా పోయింది. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌లో బాలిక మిస్సింగ్ కేసు నమోదుచేసుకున్న పోలీసులు... హాజీపూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు కల్పన కనిపించకుండా పోవడంతో అక్కడ దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. కల్పనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఒప్పుకున్న మర్రి శ్రీనివాస్‌రెడ్డిని గ్రామస్థులు, చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ సంఘటన కారణంగా శ్రీనివాస్ రెడ్డి ఉన్మాదిగా మారిపోయాడు. అప్పటి నుంచి వరుసగా హత్యాచారాలు చేస్తూ, పోలీసులకు దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నాడు. 28 ఏళ్ల శ్రీనివాస్‌రెడ్డి ఇంకా పెళ్లి కాలేదు. తరుచూ హాజీపూర్ నుంచి వేములవాడకు వెళ్లి వస్తుంటాడు. వేములవాడ ఏరియాకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. వేములవాడ నుంచి తిరిగి వచ్చే సమయంలో రోడ్డు మీద ఎదురుచూసే ఒంటరి బాలికలను టార్గెట్ చేసేవాడు.

లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ ఎక్కించుకునేవాడు. తర్వాత పాడుబడిన బావి దగ్గరికి తీసుకెళ్లి, అందులోకి తోసేసేవాడు. గాయపడిన వారిపై అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత చంపేసేవాడు. 2017లో ఓ సెక్స్ వర్కర్‌ను బుక్ చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి, నలుగురు స్నేహితులతో కలిసి ఆమెతో ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత ఆమెకు ఇచ్చే డబ్బుల విషయలో గొడవ వచ్చి, సెక్స్ వర్కర్‌ను దారుణంగా చంపి పరారయ్యాడు. కర్నూల్ టూటౌన్‌లో అతనిపై హత్య కేసు నమోదైంది. ఆ తర్వాత తప్పించుకుంటూ తిరుగుతున్న శ్రీనివాస్‌రెడ్డి, ఈ నెల మొదట్లో హాజీపూర్‌కి వచ్చి అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అయితే వారి నుంచి తప్పించుకున్న శ్రీనివాస్‌రెడ్డి... ఏప్రిల్ 25న 11:30గంటల సమయంలో స్కూల్ నుంచి రోడ్డు మీద ఎదురుచూస్తున్న శ్రావణికి లిఫ్ట్ ఇచ్చాడు. తర్వాత ఆమెను బావి దగ్గరకు తీసుకెళ్లి, అందులోకి నెట్టేశాడు. తీవ్ర గాయాలతో రక్త సిక్తమైన ఆమెపై అత్యాచారానికి పాల్పడి చంపేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా తర్వాత రోజు స్నేహితుడి పెళ్లికి వెళ్లాడు శ్రీనివాస్ రెడ్డి. అంతుకు ముందు మార్చి 9న డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న మనీషాను కూడా ఇలాగే అత్యాచారం చేసి, బావిలో పాతిపెట్టినట్టు ఒప్పుకొచ్చాడు. అత్యాచారం చేసిన తర్వాత శవాలను సంచిలో ప్యాక్ చేసి బావిలో వదిలేసేవాడు. ఏప్రిల్ 29న బావి నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుందని ఫిర్యాదు అందడంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు... సంఘటనా స్థలంలో ఆధార్ కార్డు, కాలేజీ ఐడెంటిటీ కార్డు కనిపించడంతో అనుమానం కలిగింది. తవ్వి చూడగా మనీషా, శ్రావణి మృతదేహాలు కుళ్లిపోయి ఎముకల స్థితిలో బయటపడ్డాయి. పోచంపల్లి సమీపంలోని రావిరాల గ్రామంలో బంధువుల ఇంట్లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, రిమాండ్‌కు తరలించారు. బాలికలపై హత్యాచారానికి ఒడిగట్టిన సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. తమ మధ్య ఇలాంటి మానవ మృగం ఉందనే తెలుసుకోలేకపోయామని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు హాజీపూర్ గ్రామస్థులు.

First published: April 30, 2019, 9:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading