హోమ్ /వార్తలు /క్రైమ్ /

Serial Conman: ఈడోరకం... పోలీసులకు దొరికిపోవడానికి జనాలను మోసం చేస్తాడు

Serial Conman: ఈడోరకం... పోలీసులకు దొరికిపోవడానికి జనాలను మోసం చేస్తాడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

For treatment man plots own arrest : గత ఎనిమిదేళ్లుగా అతడు ప్రజలను మోసం(Cheating) చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. అయితే ప్రతిసారీ పోలీసులకు దొరికిపోతున్నాడు. తాము జనాల్ని మోసం చేసిన దొంగను పట్టుకున్నాం అని పోలీసులు(Police) అనుకుంటుంటే..ఆ మోసగాడు మాత్రం హమ్మయ్యా అని మనసులో అనుకుంటున్నాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

For treatment man plots own arrest : గత ఎనిమిదేళ్లుగా అతడు ప్రజలను మోసం(Cheating) చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. అయితే ప్రతిసారీ పోలీసులకు దొరికిపోతున్నాడు. తాము జనాల్ని మోసం చేసిన దొంగను పట్టుకున్నాం అని పోలీసులు(Police) అనుకుంటుంటే..ఆ మోసగాడు మాత్రం హమ్మయ్యా అని మనసులో అనుకుంటున్నాడు. అతడు పోలీసులకు దొరికిపోయేందుకే గత కొన్నేళ్లుగా ఇలా చేస్తున్నాడని తాజాగా కనిపెట్టిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. అయితే అతడు ఎవరు,ఎందుకు పోలీసులకు దొరికిపోయేలా మోసాలకు పాల్పడుతున్పాడో చూద్దాం.


మహారాష్ట్రలోని పూణే(Pune)లో నివసించే అనీల్ కాంబ్లే(35)అనాథ. నిరోద్యోగి,సొంత ఇళ్లు లేదు. దగదుషీత్ గణపతి మందిర్ దగ్గర్లో ఫుట్ ఫాత్ పై పడుకుంటాడు. అనీల్ కాంబ్లే కిడ్నీ పేషెం్ కూడా. రెండు కిడ్నీలు పాడవడంతో అనీల్ కాంబ్లే(Anil Kamble) వారానికి 3-4సార్లు డయాలసిస్ ట్రీట్మెంట్(Dialysis Treatment)చేయించుకోవాల్సి ఉంది. అయితే కుంబ్లే దగ్గర దానికి అవసరమైన డబ్బులు లేకపోవడంతో అతడు మోసాలకు పాల్పడుతూ డబ్బులు సంపాదించి వాటిని ట్రీట్మెంట్,ఫుడ్ కోసం ఉపయోగించేవాడు. గడిచిన 8 ఏళ్లుగా అతను మోసాలకు పాల్పడుతున్నాడని,అతడిపై 11 చీటింగ్ కేసులు కూడా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అయితే కిడ్నీ సమస్య వచ్చినప్పటినుంచి కాంబ్లే దొరికిపోవడానికి మోసాలకు చేసేవాడు. అయితే పోలీసులకు దొరకాలనే ఉద్దేశంతోనే పోలీసులు తనని ఈజీగా ట్రాక్ చేయగలిగేలా అతడి మోసాలు ఉండేవి. అరెస్ట్ అయి జైలుకి వెళితే అక్కడ మంచి ఫుడ్,రెగ్యులర్ గా ఫ్రీ డయాలసిస్ ఉంటుందని అనీల్ అలా చేసేవాడు. జ్యుడీషియల్ లేదా మెజిస్ట్రీయల్ కస్టడీలో ఉన్న సమయంలో ఫ్రీ డయాలసిస్ అతడికి అందుతుండేది. అనీల్ కాంబ్లేైపై చివరిసారిగా చీటింగ్ కేసు నమోదైన బుండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అశ్విని సత్పూతి మాట్లాడుతూ..."ఈ నెల 3 వతేదీ వరకూ అనీల్ కాంబ్లే ఎరవాడ జైలులోనే ఉన్నాడు.


Sonali Phogat Postmortem Report :సోనాలి ఫోగట్ గుండెపోటుతో చనిపోలేదు..అత్యాచారం చేసి చంపేశారు!విడుదలైన తర్వాత ఆగస్టు 6న ఎరవాడ జైలులో విధులు నిర్వహించే మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి ఏడీజీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లు నటించి, ఆమెను బదిలీ చేయకుండా ఆపేందుకు రూ.10,000 డిమాండ్ చేశాడు. నిందితుడు తాను ఏడీజీ కార్యాలయంలో క్లరికల్ స్టాఫ్‌లో భాగమని, సీనియర్లతో తనకు మంచి సంబంధాలు ఉన్నందున ఆమె బదిలీని ఆపగలనని పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుల్ తాను మోసపోయానని అతడిని నమ్మించేందుకు మొబైల్ వాలెట్ ద్వారా రూ.10,000 ట్రాన్స్ ఫర్ చేసింది. తర్వాత పోలీసులు అతడిని ట్రాక్ చేసి పట్టుకున్నారు. ఈ క్రమంలో బ ఎరవాడ జైలులో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ దగ్గర నుంచి రూ. 10,000 మోసం చేసిన ఆరోపణలపై అనీల్ కాంబ్లేని బుధవారం అరెస్టు చేశారు. విచారణలో కాంబ్లే తనకు ఆహారం, వైద్యం మరియు జైలులో ఆశ్రయం పొందడం కోసం అరెస్టు అవబడటానికి నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. గతంలో కూడా ఇవే కారణాలతో నేరాలకు పాల్పడ్డాడు"అని తెలిపారు. పోలీసులు ఎరవాడ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 420 (మోసం మోసం) మరియు సెక్షన్ 511 (శిక్షార్హమైన నేరాలకు పాల్పడే ప్రయత్నం) కింద నిందితుడిై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Pune, Pune news

ఉత్తమ కథలు