SERBIA WOMAN MURDERS LAZY HUSBAND COOKS HIS BODY PARTS IN HUGE PAN HERE IS SHOCKING CRIME STORY SK
OMG: బద్ధకం ఎక్కువయిందని.. భర్తను ముక్కలు ముక్కలుగా నరికి.. కూర వండేసిన భార్య
భర్తతో థెరెస్సా
Woman Kills Husband: భార్యా భర్తలు నిత్యం గొడవ పడేవారని.. భర్త నిద్రపోతున్నాడన్న కోపంతో ఓసారి బెడ్‌ను కూడా ఆమె తగులబెట్టినట్లు ఇరుగుపొరుగు వారు చెప్పారు.
భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయి. వీటిని లైట్ తీసుకొని ముందుకు సాగిపోవడమే జీవితం. అందే కొందరు దంపతులు జరిగిన గొడవను కాసేపటికే మరిచిపోతారు. మళ్లీ ఎప్పటిలా కలిసిపోతారు. కానీ కొందరు మాత్రం దాన్ని సాగదీస్తూ..మరింత పెద్దది చేస్తారు. తద్వారా గొడవ ముదిరి..ఘర్షణ జరిగింది. అది కాస్తా..ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తుంది. ఇలాంటి ఘటనలు టీవీల్లో పేపర్లలో రోజూ చూస్తూనే ఉంటాం. తాజాగా సెర్బియాలోని జ్రెంజనిన్‌లో ఇలాంటి ఘోరమే జరిగింది. భర్తకు బద్ధకం ఎక్కువైందని.. తనకు సాయం చేయడం లేదన్న కోపంలో.. అతడిని చంపేసిందో (Wife Kills Husband)భార్య. అంతటితో ఆగలేదు. భర్త మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. వాటితో కూర వండేసింది.
సెర్బియా (Serbia)లోని జ్రెంజనిన్‌కు చెందిన సర్జాన్ పెరిక్ (42), థెరెస్సా పెరిక్ (46) భార్యా భర్తలు. థెరెస్సాకు పెరిక్‌కు ఇతడు ఐదో భర్త. నలుగురు భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత సర్జాన్‌ను పెళ్లి చేసుకుంది. నలుగురు భర్తలతో నలుగురు పిల్లలు ఉన్నారు. సర్జాన్‌కు మాత్రం లేరు. పెళ్లయ్యాక.. రెండేళ్ల వరకు వీరి కాపురం బాగానే ఉంది. ఆ తర్వాతి నుంచి గొడవలు మొదలయ్యాయి. సర్జాన్ పెరిక్ ఏ పనిచేసే వాడు కాదని.. సోమరితనంతో ఎప్పుడూ మంచంపైనే గడుపుతాడని.. థెరెస్సా అప్పుడప్పుడూ వాగ్వాదానికి దిగేది. ఈ క్రమంలో ఇరువురి మధ్య నిత్య గొడవలు జరిగేవి. అతడి బద్ధకంతో విసిగిపోయిన సర్జాన్ పెరిక్.. మే 10న రాత్రి సమయంలో భర్త సర్జాన్‌పై దాడి చేసి చంపేసింది. డ్రగ్స్ మత్తులో ఉన్న అతడిని కత్తితో పొడిచింది. అతడు పరిగెత్తేందుకు ప్రయత్నించగా.. గట్టిగా పట్టుకొని.. కసిదీరా చంపేసింది. సర్జాన్‌ను థెరెస్సా చంపుతుండగా ఆమె కూతురు డి.ఎల్జే స్వయంగా చూసింది.
నిందితురాలు
ఆ దృశ్యాన్ని చూసి వెంటనే తన సోదరుడికి వద్దకు పరుగెత్తికెళ్లింది డి.ఎల్జే. ఇద్దరూ కలిసి పోలీసులకు ఫోన్ చేద్దామనుకున్నారు. కానీ అదే సమయంలో గది నుంచి రంపంతో కోస్తున్న శబ్ధాలు రావడంతో భయపడిపోయి అక్కడ ఉండిపోయారు. ఆ తర్వాత సర్జాన్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికింది. అనంతరం వాటిని పెద్ద ప్యాన్‌లో ఉంచి.. కూర వండేసింది. పక్కింట్లో ఏదే జరుగుతోందని గ్రహించి.. ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇంట్లో ఉన్న దృశ్యాలను చూసి షాక్ తిన్నారు. అనంతరం థెర్సాను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సర్జాన్ పెరిక్‌ను చంపడం తాను కళ్లారా చూశానని..డి.ఎల్జే వాంగ్మూలం ఇచ్చింది. భార్యా భర్తలు నిత్యం గొడవ పడేవారని.. భర్త నిద్రపోతున్నాడన్న కోపంతో ఓసారి బెడ్‌ను కూడా తగులబెట్టినట్లు ఇరుగుపొరుగు వారు చెప్పారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.