మహిళ కోసం 9 హత్యలు.. గొర్రెకుంట కేసులో సంచలన నిజాలు

కోల్‌కతా తీసుకెళ్తానని చెప్పి నిడదవోలు వద్ద రైలు నుంచి కిందకు తోసేసినట్లు చెప్పాడు. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందనే భయంతో మక్సూద్ కుటుంబాన్ని మొత్తం మట్టుబెట్టాడు.

news18-telugu
Updated: May 25, 2020, 2:33 PM IST
మహిళ కోసం 9 హత్యలు.. గొర్రెకుంట కేసులో సంచలన నిజాలు
గొర్రెకుంట బావి
  • Share this:
తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట ఘటనలో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. బీహార్‌కు చెందిన సంజయ్ అనే వ్యక్తే ఆ తొమ్మిది మందిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కూల్‌డ్రింక్‌లో మత్తమందు కలిపి బావిలో పడేసినట్లు తెలిసింది. రెండు నెలల క్రితం మక్సూద్ కుటుంబానికి చెందిన ఓ మహిళ అదృశ్యమైంది. ఆ మహిళ సంజయ్‌తో చనువుగా ఉండేది. దాంతో అతడే ఏదో చేసి ఉంటాడని అనుమానించారు. ఈ క్రమంలోనే మక్సూద్ కుటుంబంపై పగపెంచుకున్న సంజయ్.. వారందరినీ చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాదు అదృశ్యమైన ఆ మహిళను మార్చి 8న హత్యచేసినట్లు సంజయ్ ఒప్పుకున్నాడు. కోల్‌కతా తీసుకెళ్తానని చెప్పి నిడదవోలు వద్ద రైలు నుంచి కిందకు తోసేసినట్లు చెప్పాడు. ఆ విషయం ఎక్కడ బయటపడుతుందనే భయంతో మక్సూద్ కుటుంబాన్ని మొత్తం మట్టుబెట్టాడు.

కాగా, గురువారం మక్సూద్‌(50)తో పాటు అతడి భార్య నిషా, కుమార్తె బూస్రా(22), మూడేళ్ల మనవడు గొర్రెకుంటలోని బావిలో శవాలుగా కనిపించారు. శుక్రవారం మక్సూద్‌ కుమారులు షాబాజ్‌ ఆలం(21), సోహెల్‌ ఆలం(18)తో పాటు బిహార్‌కు చెందిన వలసకార్మికులు శ్యాం(20), శ్రీరాం(21), త్రిపురకు చెందిన షకీల్‌ (30) మృతదేహాలు అదే బావిలో లభ్యమయ్యాయి. సంచలన రేపిన ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. 10 బృందాలతో 100 మంది సిబ్బంది రంగంలోకి దింపి 72 గంటల్లోనే మిస్టరీ ఛేధించారు. ముమ్మరంగా దర్యాప్తు చేసి హంతకుడిని పట్టుకున్నారు. మొత్తం 10 హత్యలను ఒకడే చేసినట్లు తెలిసింది. సాయంత్రం 4 గంటలకు ప్రెస్‌మీట్‌లో పూర్తి వివరాలను వెల్లడించనున్నారు పోలీసులు.

First published: May 25, 2020, 2:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading